calender_icon.png 14 August, 2025 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి

11-08-2025 12:36:31 AM

  1. బీసీల పై రేవంత్ రెడ్డి కుట్ర....

మాజీ మంత్రి జోగు రామన్న...

ఆదిలాబాద్, ఆగస్టు 10 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేసేంత వరకు రాష్ర్ట ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువస్తామని, బీసీలకు అనేక హామీ లు ఇచ్చిన ప్రభుత్వం వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనదని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న మండిపడ్డారు. ఆదిలాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇంకెన్ని రోజులు బీసీలను మోసం చేస్తారని ప్రశ్నించారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం కేంద్రం ఆధీనంలో ఉందంటూ చేతులు దులుపుకోవడం సరికాదని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపు బిల్లుకు చట్టబద్ధత తెస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. త్వరలో అన్ని బీసీ సంఘాలతో కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీ ఫై నిలదీస్తామన్నారు. ఈ సమావేశంలో నాయకులు మర్శెట్టి గోవర్ధన్, రౌత్ మనోహర్, మెట్టు ప్రహ్లాద్, సేవ్వా జగదీష్, రాజన్న, అశోక్ స్వామి, లక్ష్మణ్, విట్టల్, అశోక్, నిఖిల్ తదితరులున్నారు.