calender_icon.png 22 May, 2025 | 5:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లపోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన ప్రారంభం

22-05-2025 12:00:00 AM

రాజేంద్రనగర్, మే 21: సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ డివిజన్ హైదర్గూడలోని శ్రీ నల్ల పోచమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలను బుధవారం వేదపండితుల మంత్రోచరణల మధ్య అంగరంగ వైభవంగా  ప్రారంభమయ్యాయి. బాబు జగ్జీవన్రామ్ యూత్ అసోసియేషన్ సభ్యులు, ప్రణవ భక్త సమాజం సభ్యుల ఆధ్వర్యంలో ఈ మహోత్సవాలను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు.

మూడు రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాల్లో బుధవారం ఉదయం 8 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచకం, మాతకపూజ, గోపూజ, పంచగష్యప్రసన్యం ధీక్షారాధన, అఖండ దీపారాధన, యాగశాల ప్రవేశం, అనంతరం అమ్మవారి విగ్రహ ఊరేగింపు నిర్వహించారు. స్థానిక ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు.

సాయంత్రం 5 గంటల నుంచి వివిధ పూజలు ఉంటాయన్నారు.  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఏర్పాట్లు చేశారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో చుట్టు పక్కల ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

22వ తేదీన మండప పూజలు, మూలమంత్ర జపం రుద్ర హోమం, క్షీరాధ్వనం, జలదివాసం, హోమాలు, సాయంత్రం 5 గంటకు మూల మంత్ర హోమాలు, ఫల పున్వది శయాదివాసలు, 23వ తేదీన శుక్రవారం ఉదయం 5 గంటలకు మండప పూజలు, హోమాలు, అగస్యసంగర్తనాసం రత్న న్యాసం, బోజన్యాసం, ధాతున్యాసం, ఉదయం 7.36 నిమిషాలకు యంత్ర ప్రతిష్ట, విగ్రహప్రతిష్ట, కలశ ప్రతిష్ట, ఉదయం 9 గంటలకు కళాణ్యాసం, నేత్రమేళనం, 10 గంటలకు బలిప్రధానం, ధేను దర్శశనం జయ్యాదిహోమం, పూర్ణాహుతి, 11 గంటలకు కుంభాభిషేకం, బ్రహ్మణ ఆశీర్వచనం, హారతి, మంత్రపుష్వ తీర్థప్రసాద వినియోగం, మహాఅన్నతర్పణం, 12 గంటలకు మహా అన్నదానం ఉంటాయన్నారు.