calender_icon.png 8 October, 2025 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్- ౩ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్‌కు రావద్దు

08-10-2025 12:16:51 AM

గ్రూప్ 1, 2 ర్యాంకర్స్‌కు గ్రూప్- ౩ ర్యాంకర్స్ విన్నపం 

ఖైరతాబాద్; అక్టోబర్ 7 (విజయక్రాంతి) : గ్రూప్ సర్వీసులో ర్యాంకులు సాధించి ఆల్రెడీ సర్వీసులో కొనసాగతున్న గ్రూప్ వన్, గ్రూప్ టు ర్యాంకర్స్ ప్రస్తుతం జరుగుతున్న గ్రూప్- వెబ్ ఆప్షన్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరు కావద్దు అని గ్రూప్ 3 ర్యాంకర్స్ వినయ్ కుమార్, ప్రసాద్, మధు, చంద్రబాబు తదితరులు అభ్యర్థించారు. ఈ మేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూడిజిపిఎస్సి నుం డి గడిచిన 2022 సంవత్సరం నుంచి గ్రూప్ పరీక్షలకు సంబంధించిన నాలుగు నోటిఫికేషన్లు విడుదల అయ్యాయని అన్నారు.

గ్రూప్ ఫోర్ లో ర్యాంకులు సాధించిన వారందరికీ పోస్ట్ లు ఇచ్చారని ప్రస్తుతం వారందరూ డ్యూటీలో ఉన్నారని తెలిపారు. ఇటీవల గ్రూప్ వన్ సెలక్షన్ లిస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్లను 563 మందికి అందజేశా రని తెలిపారు. గ్రూప్ 2 కు సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిపో యి ఫైనల్ లిస్ట్ కూడా వచ్చిందని తెలిపారు. గ్రూపు ౧, గ్రూప్ ౨కు సంబంధించిన అభ్యర్థులు 500 మంది సోషల్ వెల్ఫేర్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ సర్వీసులలో కొనసాగుతున్న వారు 100 మంది మొత్తం 600 మంది సర్వీసుల్లో కొనసాగుతున్న వారే ఉన్నారని తెలి పారు.

వీరందరూ గ్రూప్ త్రీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కు హాజరవ్వడం వల్ల వీరి తరువాత ర్యాంక్‌లో ఉన్న గ్రూప్ 3 ర్యాంకర్స్ కు జాబులు రావని తద్వారా వారి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున గ్రూప్ 1, గ్రూప్ 2 లలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు గ్రూప్-డి డాక్యుమెంట్ వెరిఫికేషన్కు హాజరు కావద్దని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో గ్రూప్-త్రీ ర్యాంకర్ శ్రీను, వెంకట్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.