03-11-2025 02:50:34 AM
హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ర్టంలో రౌడీల రాజ్యం నడుస్తోందని, గూండాయిజం పెరిగిపోయిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మణుగూరు పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేసి దహనం చేసిన ఘటనపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటన గురిం చి తెలుసుకున్న వెంటనే జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావుతో కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. 60 లక్షల బీఆర్‌ఎస్ కుటుంబమంతా మణుగూరు పార్టీ శ్రేణులకు తోడు గా ఉంటుందని, ధైర్యంగా ఉండాలన్నారు.
త్వరలోనే మణుగూరును సందర్శిస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రౌడీ మూకలకు, వారి అరాచకత్వానికి భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ర్టం నలుమూలలా, గ్రామస్థాయి నుంచి రాష్ర్ట రాజ ధాని దాకా ప్రతిచోటా రౌడీల రాజ్యం నడుస్తోందని, అరాచకత్వం కొనసాగుతోందని, దీనికి చరమగీతం పాడే రోజు దగ్గర్‌లో ఉం దని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.