03-11-2025 02:04:30 AM
హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి) : రెండేళ్ల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి పెద్దలకే అండగా ఉన్నారని.. ఆయన చేసింది కూల్చుడేనని.. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఎంతో మంది బాధితులుగా మారారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఒక్క ఇటుక పెట్టలేదు.. ఒక్క కొత్త కట్టడం లేదని విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో హైడ్రా ఎగ్జిబిషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా హైడ్రా అరాచకాలపై కేటీఆర్ పవర్ పాయి ంట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
మూసీ, హైడ్రా వల్ల ఎంతో మంది బాధితులుగా మారారని, చాంద్రాయణగుట్టలో స్కూల్ కూడా కూలగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం రానుందని, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎవ్వరూ కూడా ఇంత అన్యాయంగా, కిరాతకంగా పనిచేయాలని కోరుకోరని, పేదవాడికి ఒక న్యాయం.. ఉన్నవాడికి ఒక న్యాయం.. ఇది ఈ ప్రభుత్వ పనితీరు అని విమర్శించారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైడ్రా ఇచ్చిన ప్రజెంటేషన్‌లో చాలా విషయాలు చెప్పారని, ఆయన చాలా బిల్డర్ల పేర్లు చెప్పారు కానీ.. మేం ఏ బిల్డర్‌ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదని స్పష్టం చేశా రు. పేదవాడి ఇంటికి బుల్డోజర్ వచ్చింది.. ఆ బిల్డర్ల జోలికి ఎందుకు వెళ్లలేదో ప్రభు త్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి అంతా సమానమైతే పెద్ద వాళ్ల జోలికి ఎందుకు వెళ్లలేదు.. వారికి ఎందు కు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. పేదలకు న్యాయం చేయాలనుకుంటే.. ఫైవ్ స్టార్ హోటళ్లలో సమావేశాలు ఎందుకు పెడుతున్నట్టు అని నిలదీశారు.
వాళ్లను ముట్టే ధైర్యం చేస్తుందా?
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెరువును పూడ్చి ఇల్లు కట్టారని, ఆయన ఇంటి కి వెళ్లే ధైర్యం హైడ్రా కమిషనర్ చేస్తారా అని ప్రశ్నించారు. మంత్రి వివేక్ కూడా హిమాయత్ సాగర్ చెరువు వద్ద ఇల్లు కట్టుకున్నారని, వీళ్లను ముట్టే ధైర్యం హైడ్రా చేస్తుందా అని నిలదీశారు. రేవంత్‌రెడ్డి అన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ లోప ల ఇల్లు కట్టుకున్నారని, సున్నం చెరువులో ఇల్లు కట్టుకున్న పేదలది తప్పు.. దుర్గం చెరువులో కట్టిన తిరుపతి రెడ్డిది ఏ తప్పులేదని విమర్శించారు.
పేదలకు అసలు టైమ్ ఇవ్వ రు.. కానీ తిరుపతి రెడ్డికి టైమ్ ఇచ్చి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేలా చేస్తారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి , గుత్తా సు ఖేందర్‌రెడ్డి చెరువుల్లోనే ఇళ్లు కట్టుకున్నారని, వారికి నోటీసులు ఇవ్వగలరా అనిప్ర శ్నించా రు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాం ధీ.. గాజులరామారంలో 11 ఎకరాలకు ప్రభుత్వమే అండగా ఉందని, పేదలను వెళ్లగొట్టి గాంధీకి మాత్రం అండగా నిలిచారని వెల్లడించారు. కాంగ్రెస్‌లో చేరితే ఒక న్యా యం.. ఇతరులకు మరో న్యాయమా నిలదీశారు.
హైడ్రా అర్ధరాత్రే ఎందుకు?
పెద్ద బిల్డర్లు కడితే వారికి సహకరిస్తారు, మూసీకి అడ్డంగా ఆకాశమంత పెద్దగా కడితే కూడా వారికి కనిపించదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, పెద్ద పెద్ద నాయకులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, కానీ పేదలపైకి బుల్డోజర్లు పంపిస్తారని మండి పడ్డా రు. బుల్డోజర్ తన శరీరంపై నుంచి వెళ్లాలని యూపీలో రాహుల్ గాంధీ మాట్లాడారని, అదే తెలంగాణలో బుల్డోజర్ ఇళ్లను కూలగొడుతుంటే రాహుల్ గాంధీ ఏం చేస్తున్నా రని ప్రశ్నించారు.
కొండాపూర్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న కొందరికి ప్లాట్లు ఇచ్చారని, వారిని కూడా హైడ్రా వెళ్లగొట్టిందన్నారు. హైడ్రా చేసేది న్యాయమే అయితే.. అర్ధరాత్రి ఎందుకు వస్తున్నట్టు అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం తమకు లేదని, మీకు న్యాయం చేసే బాధ్యత నాదని అంటూ ప్రజలకు హామీ ఇచ్చారు.