calender_icon.png 9 July, 2025 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంటగది పసందుగా

25-05-2025 12:00:00 AM

ఇల్లు అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. అందుకే ప్రతీ విషయంపై చాలా శ్రద్ధ తీసుకుంటారు. కానీ వంటగది విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తుంటారు చాలామంది. సాంప్రదాయ పద్ధతిలో వంటగదిని ఏర్పాటు చేసి ఊరుకుంటున్నారు.

కానీ ప్రస్తుతం తడి, పొడి పేరుతో రెండు వంట గదులు వస్తున్నాయి. దీంతో తక్కువ స్థలంలో వంటగది ఏర్పాటు చేసేందుకు నిర్మాణదారులు, ఇంటిరీయల్ డిజైనర్లు భారీ కసరత్తు చేస్తున్నారు. అయితే దానికోసం కొన్ని టిప్స్..

ప్రస్తుతం రిఫ్రిజిరేటర్‌ను వంట గదిలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం 15 శాతం స్థలం కావాలి. ఇటీవల డిష్ వాషర్ల వాడకం క్రమేపీ పెరుగుతున్నది. వీటికి సైతం 15 శాతం స్థలం ఉండాల్సిందే. వంట పదార్థాల్లో కొన్ని ప్యాకింగ్ ఉంటాయి. వాటి కోసం ఏడు శాతం స్థలం వదులుతున్నారు. కిచెన్ సింక్‌కు ఏడు శాతం స్థలం కావాల్సిందే అంటున్నారు.

పప్పులు, ఉప్పులు వంటి వాటిని భద్రపర్చేందుకు చాలా విస్తీర్ణం అవసరం. వంట గదిలో ఇందుకోసం అత్యధికంగా 27 శాతం కేటాయిస్తున్నారు. కూరగాయలు, పండ్లు పెట్టుకోవడానికి కూడా చోటు ఉండాల్సిందే. అన్నింటినీ ఫ్రిజ్‌లో పెట్టలేం. వీటి కోసం ఆరు శాతం అవసరం పడుతుందని చెబుతున్నారు.