16-08-2025 12:36:42 AM
సంస్థాన్ నారాయణపూర్,ఆగస్టు 15(విజయ క్రాంతి): సంస్థాన్ నారాయణపురం ఎంపీడీవో ప్రమోద్ కుమార్, ఎంపీవో నరసింహా రావు, పంచాయితీ రాజ్ ఏఈ జనయ్యలు ఉత్తమ పురస్కారం అందుకున్నారు.స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భువనగిరి జిల్లా కేంద్రంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా పురస్కారాలను అందుకున్నారు.
ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం నిత్యం ప్రజలతో మమేకమై చేసిన సేవలకు గాను అధికారులు ఉత్తమ పురస్కారానికి ఎంపిక చేశారు. ఉత్తమ పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందని తమపై మరింత బాధ్యత పెరిగిందని ఎంపీడీవో ప్రమోద్ కుమార్ అన్నారు. ఎంపీడీవో, అధికారులు ఉత్తమ పురస్కారం అందుకోవడంతో అధికారులు, పలు రాజకీయ పార్టీల నాయకులు,ప్రజలు అభినందనలు తెలిపారు.