24-10-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, అక్టోబర్23 (విజయక్రాంతి): ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన డైట్ మెనూ ఖచ్చితంగా అమలు చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. గురువారం జిల్లాలోని చిన్న గూడూరు కె.జి.బి.వి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్ వాడీ సెంటర్, ఉగ్గంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా కె.జి.బి.వి, జిల్లా పరిషత్ పాఠశాలలను పరిశీలించి, విద్యార్థుల సంఖ్య, పనిచేస్తున్న ఉపాద్యాయుల వివరాలను ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నా రు.
తరగతి గదులను, కిచెన్ షెడ్, స్టోర్ రూంను పరిశీలించి వంట సరుకుల నాణ్యతను పరిశీలించారు. తాజా కూరగాయలను మాత్రమే వాడాలని, అన్ని సరుకులు తగు పరిమాణంలో ఉం డాలని సూచించారు. మెనూ ప్రకారం భోజనం వండాలని, విద్యార్థులకు నాణ్యమైన పరిశుభ్రమమైన ఆహారాన్ని అందించాలని అన్నారు. ఉపాద్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన ఉండాలని, విద్యార్థుల యొక్క సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలన్నా రు.
వివిధ పాఠ్యాంశాలపై ప్రశ్నలను అడిగి తెలుసుకున్నారు. అంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల హాజరు, నమోదు, గర్భిణీ, బాలింతల సంఖ్య వంటి వివరాలను అంగన్వాడీ టీచర్ ను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు వడ్డించే భోజనం పరిశుభ్రంగా ఉండాలని, చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని అన్నారు.
అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి, అటెండెన్స్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిరోధక టీకాలు, నిలువ చేసే ఫ్రీజర్స్, వ్యాక్సిన్ నిల్వ పద్దతులను పరిశీలించి తగు సూచనలు చేశారు. మందుల రికార్డులను పరిశీలించారు.