31-01-2026 02:08:04 AM
ఉట్నూర్, జనవరి 30 (విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండల కేంద్రంలో సీఎం కప్ పోటీలను మార్కెట్ కమిటీ చైర్మన్ ముకాడే ఉత్తమ్ ప్రారంభించారు. శుక్రవారం మండల కేంద్రంలోని జెడ్పి ఉన్నత పాఠశాలలో సీఎం కప్ పోటీలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే సీఎంకు పోటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో జీవన్‌రెడ్డి, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంఈఓ మానుకుమార్, హెచ్‌ఎం రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.