calender_icon.png 16 December, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన ఎంపీ

15-12-2025 12:16:10 AM

కొమురవెల్లి, డిసెంబర్ 14 నూతనంగా నిర్మించిన కొమురవెల్లి రైల్వే స్టేషన్ను మెదక్ ఎంపీ ఏం రఘునందన్ రావు పరిశీలించారు. పనులు పూర్తయిన ఎందుకు ప్రారంభించడం లేదని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతో ఫోన్లో ప్రశ్నించారు. ఇందుకు రైల్వే అధికారులు స్పందిస్తూ రైల్వే మినిస్టర్ దృష్టికి తీసుకుపోయామని, రైల్వే మంత్రి కార్యాలయం నుంచి సమాచారం వచ్చిన వెంటనే ప్రారంభిస్తామని బదులిచ్చారు.

ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు పార్లమెంట్ సేషన్ జరుగుతున్నందున, ఈ సేషన్లోనే రైల్వే మినిస్టర్ ను కలిసి త్వరలోనే స్టేషన్ను ప్రారంభించడానికి చర్యలు చేపడతామని తెలిపారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, స్థానిక బిజెపి నాయకులు దండ్యాల లక్ష్మారెడ్డి, బూర్గోజు స్వరూప తదితరులు పాల్గొన్నారు