22-01-2026 03:45:03 AM
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం
కుత్బుల్లాపూర్, జనవరి 21(విజయక్రాంతి): ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుం బానికి చెందిన నలుగురు ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.స్థానికుల వివరాల ప్రకారం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగర్ కాలనీ అను రెసిడెన్సీ అపార్ట్మెంట్ లోని సతీష్ కుమార్, భార్య ఆమని,కుమారుడు నితీష్, కూతురు శ్రీజావళి నివాసముంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో నలుగురు చేతులు కోసుకొని ఆత్మహ త్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు మృతి చెందగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు గమనిం చి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.