calender_icon.png 3 January, 2026 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమీపిస్తున్న నాగోబా జాతర

03-01-2026 12:00:00 AM

జాతర ప్రారంభంలోగా రహదారులకు మరమ్మతులు జరిగేనా? 

ఉట్నూర్, జనవరి 2 (విజయక్రాంతి): రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా... రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర సమీపిస్తోంది. ఈ నెల 18వ తేదీన మహా పూజతో ప్రారంభం కానున్న నాగోబా జాతర కోసం వచ్చే మెస్రం వంశస్థులతో పాటు భక్తులకు సమస్యలు స్వాగ తిస్తున్నాయి. ఆదివాసీలు ఈ గుంతల రహదారులపై చేరుకోవలసిన పరిస్థితి.. ప్రతి ఏటా జాతర సందర్భంగా ఐటిడిఏ ఇంజనీరింగ్ విభాగం అధికారులు జాతరకు నెలరో జుల ముందు మట్టి రోడ్లకు మరమ్మత్తులు చేయించేవారు.

కానీ గత రెండుమూడు ఏళ్ల నుండి మట్టి రోడ్లకు మరమ్మతులు చేసిన గుత్తేదారులకు నేటికీ డబ్బులు రాకపోవడంతో ఈసారి రహదారుల మరమ్మత్తు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావ డం లేదు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఇంద్రాయి దేవతకు మెస్రం వంశీయులు మొక్కులు తీర్చుకొని, కేస్లాపూర్ కు వచ్చే హార్కాపూర్ తారు రోడ్డు నుంచి కేస్లాపూర్ వరకు గల మూడు కిలోమీటర్ల మట్టి రోడ్డును తార రోడ్డు మార్చుటకు గత ప్రభు త్వం రూపాయలు 1.56 కోట్లు మంజూరు చేసింది. రోడ్డు పనులు తీసుకున్న గుత్తేదారు కల్వర్టుల పనులు పూర్తి చేసి తారు రోడ్డు వేయడం నిలిపివేశారు.

దీంతో వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్డుపై పెద్ద ఎత్తున గుంతలు పడ్డాయి. ఈ రోడ్డుపై ఉమ్మడి జిల్లాతో పక్క రాష్ట్రాల నుంచి వచ్చే మెస్రం వంశస్థులు ఇబ్బందులు పడక తప్పదు. నాగోబా జాతరకు వచ్చే భక్తులు ఆలయం వరకు మెండపల్లి రహదారి పై నుంచి వేలాది మంది ఆలయానికి చేరుకుంటారు. ఈ మట్టి రోడ్డు సైతం భారీ వర్షా లకు కోతకు గురి కావడంతో పాటు కాలినడక సైతం కష్టంగా మారింది. ఇప్పటికైనా అధికారులు జాతరకు వారం రోజులు ముందుగా మరమ్మతులు చేసి రాకపోకలు సాఫీగా జరిగే విధంగా చర్యలు గిరిజనులు కోరుతున్నారు.