calender_icon.png 29 August, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి

28-08-2025 10:28:00 PM

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

హనుమకొండ (విజయక్రాంతి): పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(District Collector Sneha Shabarish) అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం, పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచడం, తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల రోజువారి ముఖ గుర్తింపు హాజరు నమోదు, పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నమోదైన విద్యార్థుల సంఖ్య వివరాలను డీఈవో వాసంతి, వివిధ మండలాల ఎంఈఓ లు జిల్లా కలెక్టర్ కు వివరించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ, విద్యార్థుల రోజువారి ముఖ గుర్తింపు  హాజరు శాతాన్ని పెంచాలన్నారు. పాఠశాలకు రాని విద్యార్థుల గైర్హాజరుకు గల కారణాలను తెలియజేయాలన్నారు. పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఎంఈఓ లు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక దృష్టితో కృషి చేయాలన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయుల ఎఫ్ఆర్ఎస్ సరైన రీతిలో నమోదు చేయాలన్నారు. తరగతి గదిలో ప్రతి విద్యార్థిని పరిశీలించి అభ్యసన సామర్థ్యాలను గురించి ఉపాధ్యాయులు అడిగి తెలుసుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యకు సంబంధించిన పలు అంశాలపై పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో వివిధ మండలాల ఎంఈవోలు, సమగ్ర శిక్షణ కోఆర్డినేటర్లు, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.