calender_icon.png 29 August, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేయూలో బీటెక్ విద్యార్థులకు ఓరియంటేషన్

28-08-2025 10:25:40 PM

కేయూ క్యాంపస్ (విజయక్రాంతి): తెలంగాణలోనే మహిళలకు ఉత్తమ ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్న మహిళల కళాశాల కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University) అని యూనివర్సిటీ రిజిస్టార్ ఆచార్య వి.రామచంద్రం అన్నారు. విశ్వవిద్యాలయ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే. భిక్షాలు అధ్యక్షన మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం ప్రవేశాలు పొందిన విద్యార్థినిల తల్లిదండ్రులకు, విద్యార్థినీలను ఉద్దేశించి ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ రిజిస్టార్ ప్రొఫెసర్ వి. రామచంద్రం మాట్లాడుతూ.. చదువుతో పాటు ఇతర అంశాలపై కూడా శ్రద్ధ వహిస్తామని, మంచి ప్లేస్మెంట్ ట్రాక్ ఉన్న కళాశాల మహిళా ఇంజనీరింగ్ కళాశాల అన్నారు.

వరంగల్ ఎస్ఐటి ఆచార్యులు ఆచార్య శైలజ కుమారి మాట్లాడుతూ, విద్యార్థికి మార్కులు ప్రధానం కాదు, విద్యార్థి క్రమశిక్షణ, కష్టం పడే తత్వం, నిజాయితీ విజయానికి మార్గాలు అని అన్నారు. ప్రిన్సిపాల్ బిక్షాలు మాట్లాడుతూ మంచి ప్లేస్మెంట్ రికార్డ్ కళాశాలకు ఉంది అని కేవలం విద్యతో పాటు క్రమశిక్షణ, సత్ప్రవర్తన వంటి అంశాలు కూడా నేర్పిస్తామన్నారు. విద్యార్థినిలు అందరినీ తమ పిల్లలుగా భావిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వాణిశ్రీ,డాక్టర్ వీణ, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.