28-08-2025 10:33:33 PM
రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న పోలీసులు
లభ్యం కానీ ఆచూకీ..
కోదాడ: పాలేరు వాగులో యువకుడు గల్లంతైన ఘటన అనంతగిరి మండలం(Ananthagiri Mandal)లో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మండల పరిధిలోని గోండ్రియాల గ్రామానికి చెందిన కిన్నెర ఉపేందర్(35) తన మిత్రుడు చింతిరాల అర్జున్ తో పాటు కలిసి ఈత పందెం వేసుకొని వాగు దాటేందుకు దిగగా వరద ఉధృతికి తట్టుకోలేక యువకుడు గల్లంతయ్యాడు. యువకుడికి అంగవైకల్యమే ఇందుకు కారణమని స్థానికులు తెలిపారు. అయితే పాలేరు వాగులో గాలించిన ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు ఉపేందర్ ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.