calender_icon.png 13 January, 2026 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టణ ఓటర్లు 51.92 లక్షలు

13-01-2026 01:52:00 AM

మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఓటర్ల జాబితా విడుదల

20న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల?

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను ఖరారు చేసింది. 117 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్లలో 51,92,220 మంది ఓటర్లు ఉన్నట్లుగా సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 25,37,136 మంది పురుషులు, 26,54, 453 మంది మహిళలు, 631 మంది థర్డ్ జండర్ ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. ఈ నెల 20న 117 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.