22-01-2026 02:03:13 AM
కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ, జనవరి 21(విజయ క్రాంతి):మహాశివరాత్రి పర్వదినానికి అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పూర్తిచేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు.బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఫిబ్రవరి 15వ తేదీన జరగనున్న మహాశివరాత్రి వేడుకల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులు, వేద పండితులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ మహాశివరాత్రి ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో పూర్తిచేయాలన్నారు. మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లను పూర్తి చేసి విజయవంతంగా నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్, మున్సిపల్, పోలీస్, తదితర శాఖల ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు.
ఈ సమావేశంలో హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేయి స్తంభాల దేవాలయం వద్ద నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా క్యూలైన్లు ఏర్పాటు చేసి, భక్తులకు ఏ చిన్న సమస్య తలెత్తకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్వహించాలని సూచించారు.
ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ గతంలో చేసిన ఏర్పాట్ల కంటే ఈ ఉత్సవాల సందర్భంగా అన్ని ఏర్పాట్లును సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలన్నా రు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రవి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎండి అజీజ్ ఖాన్, డిఆర్‌ఓ వైవి గణేష్, హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, ఏసిపి నరసింహారావు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ మధుసూదన్, సీఐ మచ్చ శివకుమార్, వేద పండితులు పాల్గొన్నారు.