calender_icon.png 22 September, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఘనత బీఆర్‌ఎస్‌దే..

22-09-2025 12:07:15 AM

నంగునూరు, సెప్టెంబర్ 21: రైతాంగానికి పెద్దపీట వేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని, తెలంగాణ రైతుల కష్టాలు, బాధలు తెలిసిన గొప్ప నాయకులు కెసిఆర్, హరీష్ రావులు అని మండల బిఆర్‌ఎస్ నాయకులు అన్నారు. మండల పార్టీ అధ్యక్షులు లింగం గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ. నర్మెటలో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ బీఆర్‌ఎస్ ప్రభుత్వ దూరదృష్టి, సంకల్పం, కఠోర శ్రమకు నిదర్శనమని పేర్కొన్నారు.

బిఆర్‌ఎస్ హయాంలో జిల్లాల్లో 12000ఎకరాల ఆయిల్ ఫాం సాగు చేయగా, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం 2000 ఎకరాల్లో సాగు జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప రైతులకు చేసింది ఏమీ లేదని, మండల వ్యాప్తంగా 2500 ఎకరాలు సాగు ఉందన్నారు. హరీష్ రావు దృడ సంకల్పాన్ని నమ్మి వమ్ము చేయకుండా పంటను సాగు చేస్తున్న రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ట్రయల్ రన్ విజయవంతం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని బిఆర్‌ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసి, నిర్మాణ పనులు మొదలుపెట్టగా, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కేవలం రిబ్బన్ కట్ చేయడానికి తమ జేబుల్లో కత్తెర్లు పెట్టుకుని తిరుగుతున్నారని ఎద్దేవ చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులనే ఇప్పుడు ప్రారంభించి తమ ఘనతగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు.

ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, మాజీ జడ్పీటీసీ రాగుల సారయ్య, సీనియర్ నాయకులు వేముల వెంకట్ రెడ్డి, దువ్వల మల్లయ్య, లక్ష్మారెడ్డి, మహేందర్ గౌడ్, ఉల్లి మల్లయ్య, వేణు చక్రవర్తి, సిద్దేశ్వర్ గౌడ్, రాంరెడ్డి, కనకయ్య తదితరులు ఉన్నారు.