22-09-2025 12:06:42 AM
కామారెడ్డి, సెప్టెంబర్ 21 (విజయ క్రాంతి): కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చీరస్మర నియమని కామారెడ్డి పట్టణ టిఆర్‌ఎస్ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆదేశాల మేరకు టిఆర్‌ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ఆస్తులను కూడా లేక చేయకుండా ఉద్యమాలకు ఖర్చు పెట్టారన్నారు. తెలంగాణ వాదాన్ని నినాధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మనకు కావాల్సిన నిధులు నియామకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ పోరాటం చేశారన్నారు.
ఎన్నో ఉన్నత పదవులు ఇస్తామన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నీ లెక్కచేయకుండా పదవులు ముఖ్యం కాదని తెలంగాణకు జరుగుతున్న నష్టం గురించి వివరిస్తూ తెలంగాణ అభివృద్ధి కోసం ఆ పదవులను తిరస్కరించిన గొప్ప మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు అర్కల ప్రభాకర్ యాదవ్, భూమ్ రెడ్డి, మల్లేష్ యాదవ్, పట్టణ నాయకులు జగదీష్ యాదవ్, మాసుల లక్ష్మీనారాయణ, జెర్సీ నర్సింహులు, నరేష్ రెడ్డి, మహిళా నాయకురాలు లత, నగేష్, ఎల్లేష్, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
పెద్ద ఎక్లారాలో..
మద్నూర్ సెప్టెంబర్ 21 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లారాలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మార్కండేయ మందిరంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సమాజానికి అందించిన సేవలను కొనియాడారు. తొలి దశ ఉద్యమం నుంచి మలి దశ ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిదన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడంలో ఆయన చూపిన త్యాగం, ధైర్యం, క్రమశిక్షణ ప్రతి తరానికి స్ఫూర్తిదాయకం అన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగాపద్మశాలి నిలిచిపోతారన్నారు.ఈ కార్యక్రమం లో పద్మశాలి సంఘం సభ్యులు సంఘం సభ్యులు మెరిగే వార్ శ్రీనివాస్, శ్రీకాంత్, వినాయక్ రాజు సంజు, పోశెట్టి వెంకట్ గంగాధర్ రాములు తదితరులు పాల్గొన్నారు.
కొత్త బస్టాండ్ వద్ద ..
కామారెడ్డి, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు ఆదర్శనీయమని పద్మశాలి సంఘం నేత, న్యాయవాది క్యాతం సిద్ధిరాములు అన్నారు. ఆదివారం కొత్త బస్టాండ్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం ప్రతినిధులు చాట్ల రాజేశ్వర్, సిరి గాద లక్ష్మీ నరసింహులు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు సిరిగాద శంకర్, ధర్మపురి, న్యాయవాది నాగభూషణం, రాజయ్య, దామోదర్, తదితరులు పాల్గొన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులు
ఆర్మూర్, సెప్టెంబర్ 21 (విజయ క్రాంతి) : నిజాం నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలు, స్వాతంత్య్ర ఉద్యమ పోరాటంతో పాటు తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ మనందరికీ స్ఫూర్తిదాయకమని ఈ.ఆర్. ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ ఉన్నారు. ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలో గల ఆయన విగ్రహానికి ఈ.ఆర్. ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసిన నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయవేత్త అని కొనియాడారు. తొలి, మలితరం తెలంగాణ ఉద్యమాల్లో ఆయన ముందుండి నడిపించారన్నారు. ఆయన చేసిన పోరాటాలు, త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేనివి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు రాంప్రసాద్, గంగమోహన్ చక్రూ, నూకలు శేఖర్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు మోహన్ దాస్, దాసరి సునీల్, అంబల్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
రోటరీ ఆధ్వర్యంలో..
అర్మూర్, సెప్టెంబర్ 21 (విజయ క్రాంతి) : అర్మూర్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని చేనేత కాలనీ చౌరస్తా వద్ద గల ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. రోటరీ అధ్యక్షుడు రాధా కిషన్ మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమం నుండి తెలంగాణ ఉద్యమం వరకు కృషి చేసిన అలుపెరుగని పోరాటయోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రధాన కార్యదర్శి ఖాందేశ్ సత్యం, కోశాధికారి కోట నరేష్, మాజీ అధ్యక్షులు దాసరి సునీల్ కుమార్, వంగ వివేకానంద, గంగమోహన్ చక్రు, చెలిమేల రాజేందర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.