calender_icon.png 12 May, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాసమస్యల పరిష్కారానికే పోరుబాట

24-03-2025 01:26:50 AM

 సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు శ్రీశైలం 

మునుగోడు, మార్చి 23 : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీపీఎం ఆధ్వర్యంలో గ్రామగ్రామాన పోరుబాట నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీజిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బండా శ్రీశైలం అన్నారు. ఆదివారం మునుగోడులో సీపీఎం నాయకులతో కలిసి ఆయన పర్యటించి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన  మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కరువై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పల్లెల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కిష్టాపురం శివారులో నిర్మిస్తున్న ఫార్మా కంపెనీ అనుమతులు రద్దు చేసి వెంటనే పనులు నిలిపేయాలన్నారు.

కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు వరికుప్పల ముత్యాలు, యాసరాణి శ్రీను, మిరియాల భరత్, వేముల లింగస్వామి, యాట యాదయ్య, కట్ట లింగస్వామి, పగిళ్ల మధు, చికూరి బిక్షం, పగిళ్ళ పరమేశ్, కల్వలపల్లి గ్రామ కార్యదర్శి వంటేపాక అయోధ్య, వంటేపాక రమేశ్ , యాసరాని వంశీకృష్ణ,యాట శ్రీకాంత్ పాల్గొన్నారు.