calender_icon.png 19 December, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ పోరు రసవత్తరం

15-12-2025 12:00:00 AM

  1. కందుకూరు, మహేశ్వరంలో పోటాపోటీగా నువ్వా నేనా అన్న చందంగా నడుస్తున్న ప్రచారం
  2. డీజేలు పెట్టి సైతం బతుకమ్మలు, డ్యాన్స్ అడిస్తున్న వైనం 

కందుకూరు, మహేశ్వరం డిసెంబర్ 14 (విజయ క్రాంతి) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు, మహేశ్వరం మండలాల్లో ఉన్న గ్రామ పంచాయతీల పోరు రసవత్తరంగా మారిం ది. ఆయా మండలాల్లో మహేశ్వరంలో రెండు కందుకూరులో మూడు సర్పంచ్ స్థానాలకు ఏకగ్రీవం కాగ మిగతా స్థానాలకు నువ్వా నేనా అన్న చందంగా ప్రచార పర్వం కొనసాగుతుంది.

ముఖ్యంగా కందుకూరు మండలంలో సరస్వతి గూడ,నేదునూరు, జైత్వారం, పులిమామిడి, కందుకూరు, దాసర్లపల్లి, కొలనుగూడ, గుమ్మడవెల్లి, మీర్ఖా న్పేట్, కొత్తగూడ, మాదాపూర్లలో ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రతి ఇంటింటికి తిరిగి అభ్యర్థులు తమకు ఓటు వేయండి అని ప్రతి ఒక్క ఓటరు అభ్యర్థిస్తూ వేడుకుంటున్న చిత్రాలు కనబడుతున్నాయి. మహేశ్వరం మండలంలోని కోళ్ల పడకల్, తుమ్మలూరు, మహేశ్వరం, సిరిగిరి పురం తదితర గ్రామాలలో ప్రచారం కొనసాగుతుంది.

ఈ ప్రచార పర్వంలో భాగంగా ఓటర్లు అన్నింటికీ తామై నడుస్తామా లేదా అన్న చందములో అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయా మండలాల్లో సర్పంచ్ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు డీజే ఏర్పాట్లు చేసి సౌండ్ లతో మహిళలను ఆకట్టుకునేందుకు డాన్సులు, బతుకమ్మలు ఆడిపిస్తూ మహిళా ఓటర్లను కాలా వేలా పడి అభ్యర్థిస్తున్న చిత్రాలు విచిత్రంగా కనిపిస్తున్నాయి.

గ్రామాల్లో.. ఈనెల 17న మూడో విడత జరుగుతున్న ఎన్నికల్లో మహేశ్వరం, కందుకూరు మండలాల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు మహిళా ఓటరు వృద్ధులు యువకులు ప్రతి ఒక్కరు సిద్ధపడ్డారు. అయినా పోటీ చేస్తున్న అభ్యర్థులు కచ్చితంగా తాము గెలవాలంటే ఓటర్లను కలవక తప్పడం లేదని వారిని ప్రసన్నం చేసుకుంటే కానీ తమకు ఓట్లు వచ్చే విధంగా లేవని కొందరు అభ్యర్థులు మదన పడుతున్నారు. సర్పంచులుగా వార్డు మెంబర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు ఈనెల 17న వారి భవితవ్యాలను బ్యాలెట్ పత్రాలలో చూసుకోవాల్సిందేనని పలువురు రాజకీయ నాయకులు పేర్కొంటున్నారు.

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

మొయినాబాద్, డిసెంబర్ 14:  గ్రామ పంచాయతీ ఎన్నికల రెండవ విడత పోలింగ్ ను సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి  తెలిపారు. ఆదివారం రంగారెడ్డి జిల్లాలో రెండవ విడుతలో 7 మండలాలో ఎన్నికలు నిర్వహిస్తున్న సందర్బంగా కనకమామిడి, కేతిరెడ్డిపల్లి, ముడిమ్యాల, పొత్ గల్, షాబాద్, సర్దార్ నగర్ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పరిశీలించారు.

ఓటర్ జాబితా ప్రకారం ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాలని, ఎలాంటి తప్పిదాలు జరగకుండా విధులు నిర్వహించాలని ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. పోలింగ్ నిర్వహణను, ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పోలింగ్ స్టేషన్ ఆవరణలో పోటీ చేయు సర్పంచి, వార్డు సభ్యుల జాబితాను పరిశీలించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం ఎప్పటికప్పుడు నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేయాలనీ స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు

మధ్యాహ్నం ఒంటి గంట లోపు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. ఒంటి గంట తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రం గేటు లోపలికి ఎవ్వరిని అనుమతించకూడదనీ, మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని కలెక్టర్ పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఎన్నికల అధికారులను ఆదేశించారు.   ముందు వార్డు సభ్యులకు సంబంధించిన ఓట్లు లెక్కించిన తదుపరి సర్పంచ్ ఓట్లు లెక్కించడం జరుగుతుందని అన్నారు. కలెక్టర్ వెంట చేవెళ్ళ ఆర్డీఓ చంద్రకళ, మొయినాబాద్ తహసీల్దార్ గౌతం, తదితరులు ఉన్నారు.