calender_icon.png 19 December, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపుతోనే గ్రామాల అభివృద్ధి

15-12-2025 12:00:00 AM

ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

అబ్దుల్లాపూర్ మెట్, డిసెంబర్ 14: కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని.. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని గండిచెరువు సర్పంచ్ అభ్యర్థి జక్కా రవీందర్ రెడ్డి ,లష్కర్ గూడ సర్పంచ్ అభ్యర్థి అల్లే ఐలయ్య యాదవ్ , అనాజ్ పూర్ సర్పంచ్ అభ్యర్థి  ఏర్పుల సుశీల దానయ్య , మజీద్ పూర్ సర్పంచ్ అభ్యర్థి మేడిపల్లి లావణ్య వెంకటేష్ గౌడ్ , జాఫర్ గూడ సర్పంచ్ అభ్యర్థి ఎర్ర వెంకటేష్ , బండరావిరాల సర్పంచ్ అభ్యర్థి బంగారి నర్సింగరావు , చిన్నరావిరాల సర్పంచ్ అభ్యర్థి పబ్బత్ బాలకిషన్ గౌడ్ , కవాడిపల్లి సర్పంచ్ అభ్యర్థి కొలను ప్రసన్న రవీందర్ రెడ్డి, బలిజగూడ సర్పంచ్ అభ్యర్థి ఉప్పు వెంకటేష్ తో  పాటు పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని.. మరింత అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత మీ అందరిపైన ఉందని అన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏమి లేదన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని..  అప్పుల పాలు చేసిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. ప్రజా పాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందజేస్తూన్నామని మహిళలకు ఉచిత బస్సు, రైతు బంధు, సన్న బియ్యం పంపిణీ, అర్హులైన పేదలకు రేషన్ కార్డుల పంపిణీ, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని అన్నారు. ఇళ్లు లేని నిరుపేదలందరికీ గ్రామాల్లో ప్రభుత్వ స్థలం గుర్తించి అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చే బాధ్యత నాదని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.