15 April, 2026 | 12:37 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కార్యకర్తలే బీఆర్‌ఎస్‌కు పట్టుగొమ్మలు

24-01-2026 12:00 AM

ఉప్పల్ జనవరి 23విజయక్రాంతి : కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని  ఉప్పల్ శాసన సభ్యులు బండారు లక్ష్మారెడ్డి అన్నారు. నాచారం డివిజన్లోని  శ్రీరామ నగర్ లో ఉంటున్న బిఆర్‌ఎస్ కార్యకర్త టేకుల రామచందర్ గత కొంత క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ  ఇటీవల కాలంలోఆరోగ్యం మెరుగుపడడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రామచంద్ర ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పార్టీకి కార్యకర్తల బలమని  అలాంటి కార్యకర్తల బాగోగులు చూసుకోవడం  తన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ నాయకులు  సాయి జన్ శేఖర్ మెడల మల్లికార్జున గౌడ్ విట్టల్ యాదవ్ కార్యకర్తలు పాల్గొన్నారు