calender_icon.png 24 January, 2026 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయిబాబా ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

24-01-2026 12:00:00 AM

కామారెడ్డి అర్బన్, జనవరి 23, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో గల సాయిబాబా ఆలయంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) సలహాదారులు శెనిశెట్టి శ్రీనివాస్ పద్మ దంపతుల ఆధ్వర్యంలో వసంత పంచమి సందర్భంగా 108 పీఠలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 108 జంటలు వ్రతంలో పాల్గొని ఆశీస్సులను పొందడం జరిగింది.

మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శెని శెట్టి శ్రీనివాస్ పద్మ దంపతులకు జిల్లా అధ్యక్షుడు ఎర్రం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్, కోశాధికారి కస్వ వెంకన్నలు సన్మానించడం జరిగింది.