20-12-2025 01:32:14 AM
హైదరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ పదవులు, నియా మకంపై కసరత్తు చేపట్టింది. పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ఇక పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయా లని నిర్ణయం తీసుకున్నది. పార్టీ పదవుల విషయానికి వస్తే నలుగురు పీసీసీ వర్కిం గ్ ప్రెసిడెంట్లను నియమించాలని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు లకు బీసీ, ఎస్సీ, ఓసీ, ఎస్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరిని ప్రెసిడెంట్స్‌గా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులు, వివిధ కులాలు, జనరల్ కార్పొరేషన్లకు చైర్మన్లను భర్తీ చేయనున్నారు. కార్పొరేషన్ చైర్మన్ పదవులు కొంత మంది ఎమ్మెల్యేలకు ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా నామినేటెడ్ పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయలే దు. దీంతో చాలామంది నాయకులు, పార్టీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నారు. ఇదే అంశంపై రెండు రోజులుగా పార్టీ నేతలు సీరియస్‌గానే చర్చిస్తున్నారు.
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, ఇన్‌చార్జ్ కార్యదర్శులతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు సమావేశమై నిర్ణ యం తీసుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్స్ పదవుల కోసం చాలా మందినే పోటీ పడుతు న్నారు.
అయినప్పటికీ ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, ఓసీ సామాజిక వర్గం నుంచి భువనగరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, పార్టీ నాయకులు రోహిన్‌రెడ్డి, బీసీ సామాజిక వర్గం నుంచి గద్వాల జడ్పీ మాజీ చైర్మన్ సరితా తిరుపతయ్య యాదవ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తు న్నాయి.
ఒక మైనార్టీ వర్గానికి వర్కింగ్ ప్రెసిడెం ట్ పదవీ ఇస్తీ బీసీ సామాజిక వర్గానికి ఇవ్వకపోచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయి తే పీసీసీ అధ్యక్షుడిగా మహేష్‌కుమార్‌గౌడ్ నియామకమై ఏడాదిన్నర కాలం పూర్తి కావస్తోంది. అయినా ఇప్పటీ వరకు పూర్తిస్థా యిలో కార్యవర్గం ఏర్పాటు చేయలేదు. ఇప్పటీ వరకు పీసీసీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులతో పాటు అధికార ప్రతినిధులు, డీసీసీల నియామకం మాత్రమే పూర్తయింది.