calender_icon.png 16 November, 2025 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధికి బీహార్ ప్రజల పట్టం

15-11-2025 12:00:00 AM

  1. జూబ్లీహిల్స్‌లో ప్రజాతీర్పును శిరసావహిస్తాం

ఈ గెలుపు కాంగ్రెస్‌ది కాదు... ఎంఐఎంది

డిసెంబర్ 7న ప్రజా వంచన దినోత్సవం

బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎన్.రాంచదర్ రావు

రాహుల్ గాంధీ, కేటీఆర్ ఐరన్ లెగ్స్

బెంగాల్‌తోపాటు తెలంగాణలోనూ కాషాయ జెండా ఎగరేస్తాం

రాహుల్ గాంధీ ఇక పబ్జీ గేమ్‌కే పరిమితం

కేంద్రమంత్రి బండి సంజయ్

బీహార్ గెలుపుతో పార్టీ కార్యాలయంలో నేతల సంబురాలు

హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): ‘బీహార్  ప్రజలు బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమికి 200పై సీట్లను కట్టబెట్టారు. కాంగ్రెస్‌ను ఒక్క సీటుకే పరిమితం చేశారు. ఎంఐఎంకు 7 సీట్లు వచ్చాయి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచదర్ రావు అన్నారు. ‘ఓట్ చోర్ అని చెప్పినా, ఎన్నికల కమిషన్‌పై ఎన్ని నిందలు వేసినా కాంగ్రెస్‌ను జనం పట్టించుకోలేదు. ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు.

డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే అభివృద్ధి సాధ్యమని నమ్మి బీహార్ ప్రజలు ఓట్లేశారు. తెలంగాణలోనూ అదే రిపీట్ కాబోతోంది’ అని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీకి ఎప్పుడూ మెజారిటీ రాలేదని,  ప్రజాతీర్పు ను శిరసావహిస్తామని, అయితే ఈ గెలుపు కాంగ్రెస్‌ది కానేకాదని, ఎంఐఎం విజయం గా భావిస్తున్నామన్నారు.  సిట్టింగ్ సీటు కోల్పోయిన తరువాత కూడా బీఆర్‌ఎస్ రాష్ర్టంలో ప్రత్యామ్నాయం చెప్పడం ఆశ్చర్యమేసిందన్నారు. జూబ్లీహిల్స్ ఫలితాలు ఎలా ఉంటాయో ‘మాకు తెలు సు’.

అయినప్పటికీ గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. బీహార్‌లో ఎన్డీయే గెలుపు నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నేతలు సంబురాలు జరుపుకున్నారు. బాణా సంచా కాల్చి, స్వీట్లు పం చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాంచందర్ రావు, కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమురయ్యతోపాటు ఇతర నేతలు పాల్గొన్నారు.

రాంచందర్ రావు మాట్లాడు తూ... గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా రాలేదని, అయినా ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిందన్నారు. బీజేపీ కూడా అంతేనని, రాష్ర్టంలో రాజకీయ మార్పులు సంభవిస్తాయని, రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.  డిసెంబర్ 7న ప్రజా పాలన దినోత్సవం పేరుతో కాంగ్రెస్ సంబురాలు చేయబోతోందని, ఆరోజు ‘కాంగ్రెస్ ప్రజా వంచన దినం’ పేరుతో బీజేపీ పెద్ద ఎత్తున పోరాటాలకు ప్లాన్ చేస్తుందని తెలిపారు.

లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటుతాం: బండి సంజయ్

భారత దేశంలో రాహుల్ గాంధీ, తెలంగాణలో కేటీఆర్ ఐరన్ లెగ్స్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. బీహార్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ పని ఖతమైందని, రాహుల్ గాంధీ ఇక పబ్జీ గేమ్ ఆడుకోవడానికి పరిమితమవుతారని అన్నారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి నేటి వరకు బీఆర్‌ఎస్ పతనం కొనసాగుతూనే ఉందన్నారు. జీహెఎంసీ ఎన్నికల్లో 99 సీట్లుంటే 56కి తగ్గిపోయాయన్నారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ సిట్టింగ్ స్థా నాలను కోల్పోయిన తరువాత కూడా రా ష్ర్టంలో బీఆర్‌ఎస్సే ప్రత్యామ్నాయమని కేటీఆర్ చెప్పడం సిగ్గు చేటన్నారు.

బీహార్ ఎ న్నికల్లో అత్యధిక మెజారిటీతో ఎన్డీఏ కూ టమికి అధికారాన్ని కట్టబెట్టి నరేంద్రమోదీ నా యకత్వంపట్ల విశ్వాసాన్ని కనబర్చారన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మైనారిటీలంతా ఒక్కటై కాంగ్రెస్‌ను గెలిపించారని అన్నారు. ఇకపై హిందువులందరినీ ఏకం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందన్నారు.  అమిత్ షా చెప్పినట్లుగా అబ్ కీ బార్ 160 పార్ నినాదం సక్సెస్ అయ్యిందని, బీహార్ మాది... వచ్చే ఏడాది జరగబోయే బెం గాల్‌లో బీజేపీ అధికారంలోకి రాబో తోందన్నారు. 

బ్లాక్ మెయిల్ రాజీకీయాలు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి 

బ్లాక్ మెయిల్‌తో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్‌లో గెలిచిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించకుంటే సంక్షేమ పథకా లు రావంటూ ప్రజలను సీఎం బెదిరించారని, ఆ భయానికే ప్రజలు ఈ తీర్పు ఇచ్చినట్లు కన్పించిందన్నారు. ఒవైసీ అండదండలతో కాంగ్రెస్ గెలిచిందని, యావత్ భారతదేశం మోదీ నాయకత్వాన్ని బలపరుస్తోందని, తెలంగాణలో అప్రజాస్వామికంగా ఎమ్మెల్యేల చోరీ నడుస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీకి  చిత్తశుద్ధి ఉంటే ఫిరాయిం పు ఎమ్మెల్యేల చేత రాజీనామా చే యించి ఉప ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జాతీ య నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ లు అంజిరెడ్డి, మల్క కొమరయ్య, నాయకులు గౌతంరావు, వీరేందర్ గౌడ్, ఎన్వీ సుభాష్, వేముల అశోక్  తదితరులు పాల్గొన్నారు.