calender_icon.png 14 May, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాల్పుల విరమణపై ప్రజలకు వివరణ ఇవ్వాలి

14-05-2025 12:18:14 AM

సిద్ధిపేట, మే 13 (విజయక్రాంతి): ఉగ్రవాదులకు కోమ్ముకాస్తున్న పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా కాల్పుల విరమణ చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు వెనక్కి తగ్గారో దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ డిమాండ్ చేశారు.

సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ భారతదేశ భూభాగంలోకి చోచ్చుకొచ్చి పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పులపై ప్రపంచమంతా తీవ్రంగా ఖండించిందన్నారు. ప్రతీకార చర్యలో భారత సైనికులు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టారన్నారు.

పాకిస్తాన్ పై భారతదేశం యుద్ధంలో గెలుస్తున్నప్పుడు ఎందుకు వెనక్కి తగ్గారని మండిపడ్డారు. దేశం మొత్తం సైనికుల వైపు ఉంటే మోడీ మాత్రం ట్రంప్ వైపు ఉన్నాడని, కాల్పుల విరమణతో దేశ ప్రజలంతా మోడీని తిట్టుకుంటున్నారని విమర్శించారు. కర్రెగుట్టలో కూంబింగ్ లను ఆపేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కేదారి మధు, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గయాజుద్దీన్, మైనార్టీ జనరల్ సెక్రెటరీ హర్షద్, నాజ్జు, రవితేజ, తదితరులు పాల్గొన్నారు.