14-05-2025 12:18:11 AM
అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాల ఫౌండర్ అనిల్ కుమార్
నాగారం మే 13 : మండలంలోని పసునూరు గ్రామంలో ఈనెల 17న జరిగే బడుగు బలహీన వర్గాల, అట్టడుగు జాతుల ఆశాజ్యోతులు, సబండ కులాల తలరాతలు మార్చిన మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ ల విగ్రహాల ఆవిష్కరణ సభను జయప్రదం చేయాలని మాదిగ కళామండలి రాష్ట్ర అధ్యక్షులు, విగ్రహాల కమిటి ఉత్సవాల ఫౌండర్, చైర్మన్ డాక్టర్ మల్లెపాక అనిల్ కుమార్ మాదిగ అన్నారు.
మంగళవారం గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈసభకు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్ ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు, ఏపూరి సోమన్న తదితరులు పాల్గొంటున్నందున అధిక సంఖ్యలో ప్రజల పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.