11-10-2025 01:07:19 AM
నిర్మల్ రూలర్, అక్టోబర్ ౧౦ (విజయక్రాంతి): ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి అక్కడ విసిట్ వీసాతో యజమానులు చ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని నిర్మల్ జిల్లాకు చెందిన పలువురు యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని సోన్ కుంటా ల లక్ష్మణ చందా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 12 మంది యువకులు ఇటీవలే ఉపాధి నిమిత్తం దేశానికి వెళ్లారు.
అక్కడ తమకు సరైన పని ఇవ్వకపోగా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని తమను వెంట నే ఇండియాకు తీసుకురావాలని వీడియో రూపంలో ఇక్కడికి ప్రవాసమిత్ర యూనియన్ సభ్యులకు సమాచారం ఇచ్చినట్టు రాష్ట్ర అధ్యక్షులు స్వదేశీ పరిపాల తెలిపారు. వెంటనే అక్కడ అధికారులతో సంప్రదించి వారి ఇండియాకు రప్పించేందుకు కృషి అయినట్టు ఆయన వివరించారు.