calender_icon.png 12 October, 2025 | 8:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌టీఐపై అవగాహన కల్పించాలి

11-10-2025 01:08:39 AM

ఆదిలాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాం తి): సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ప్రభుత్వ అధికారుల పని తీరులో పారదర్శకత,  జవాబుదారీతనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఒక మైలురాయిగా చట్టం ఉందని, ప్రభుత్వం నుండి సమాచారం పొందే హక్కు గురించి పౌరులలో అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 5 నుండి 12 వరకు ఆర్‌టీఐ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతోందని జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలా దేవి అన్నారు. 

అక్టోబర్ 5 నుండి 12 వరకు  గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న సమాచార హక్కు చట్టం వారోత్సవాలలో సందర్భంగా శుక్రవారం అదనపు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసి న జిల్లా స్థాయి  సమావేశంలో ఆమె పాల్గొ ని పలు  సూచనలు చేశారు.

ఈ సందర్భం గా అదనపు కలెక్టర్ శ్యామలా దేవి మాట్లాడుతూ ఆర్‌టీఐ చట్టంపై ప్రతీ ఒక్క రూ అవగాహన కలిగి ఉండాలని, ఈ చట్టంను సమర్ధవంతంగా నిర్వహించాలాన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు వారి క్రింది స్థాయి సిబ్బంది కి చట్టం మీద అవగాహన కలిగించే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో  కలెక్టరేట్ ఏవో వర్ణ, పలువురు రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.