calender_icon.png 10 July, 2025 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలి

10-07-2025 12:00:00 AM

మల్టీజోన్  2 ఇన్‌చార్జి ఐజీపీ తఫ్సీర్ ఇక్బాల్

సూర్యాపేట, జూలై 9 (విజయక్రాంతి) : పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉత్తమ సేవలు అందించాలని మల్టీ జోన్‌_2 ఇంచార్జ్ ఐ జి పి తప్సీర్ ఇక్బాల్ అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సమావేశ మందిరం నందు ఎస్పీ తో కలిసి డీఎస్పీలు, సీఐలతో సమావేశం నిర్వహించి జిల్లా భౌగోళిక పరిస్థితులు, జిల్లాలోనీ ప్రముఖ ప్రాంతాలు, వృత్తులు, జనాభా, రాజకీయ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సంవత్సరంలో నమోదైన నేరాలు వాటి తీరుతెన్నులు, నేరాల నివారణలో జిల్లా పోలీసు వ్యూహాలపై ఆరా తీశారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపించేందుకు తగు చర్యలు తీసుకోవాలనీ సూచించారు. అంశాలపై ఎస్పీ నరసింహ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ వివరించారు. తదుపరి ఇంచార్జ్ ఐజిపి మాట్లాడుతూ నేరాల నివారణలో ముందస్తు ప్రణాళికతో పని చేయాలని, కేసుల దర్యాప్తులో నైపుణ్యం చూపాలని ఆదేశించారు.

జిల్లాలో ఎటువంటి అక్రమ విధానాలు అనుసరించకుండా పోలీసులు కట్టడి చేయాలన్నారు. ముందుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, ఏ ఆర్ అధనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్, కోదాడ డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి, ఏ ఆర్ డి ఎస్ పి నరసింహ చారి, ఏవో మంజు భార్గవి, పలువురు సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.