calender_icon.png 20 May, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదేండ్ల బీజేపీ పాలనలో పేదలకు ఒరిగిందేమీ లేదు

20-05-2025 01:29:53 AM

 సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు

యాదాద్రి భువనగిరి మే 19(విజయక్రాంతి): బీజేపీ నిరంకుశ విధానం విడనాడి  పేరుకు పోయిన ప్రజా సమస్యలను పరిష్కరించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ని సాధన స్కూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతీ విషయంలో నియంతృత్వ వైఖరి అవలంబిస్తుందని అన్నారు.

ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో నిన్న హైదరాబాద్ లో అవగాహన సభ పెట్టారని దానికి కేంద్ర మంత్రి ఆన్లైన్ లో హజరయ్యారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే ఎన్నిక విధానం అసాధ్యం అన్నారు. రాజుల పరిపాలన దిశగా బీజేపీ అడుగులేస్తోందని విమర్శించారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అంశం పై జరిగే నష్టాన్ని ఆయన వెళ్ళడించారు.

పహాల్గం ఉగ్రదాడి విషయం లో బీజేపీ విధానం తానే పాలక వర్గం తానే ప్రతిపక్షంగా వ్యవహారిస్తున్న తీరును ఆయన ఎండగట్టారు.  సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు పాల్గొన్నారు.