20-05-2025 08:22:19 PM
చిట్యాల శ్రీనివాస్..
కాటారం (విజయక్రాంతి): కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుడు మంతెన శ్రీనివాస్ కాలేశ్వరంలోని సరస్వతి పుష్కరాలలో విధులు నిర్వహిస్తూ వడదెబ్బతో మృతి చెందడం బాధాకరమని భూపాలపల్లి జిల్లా ధర్మ సమాజ పార్టీ ఉపాధ్యక్షులు(Vice President of Dharma Samaj Party) చిట్యాల శ్రీనివాస్(Chityala Srinivas) అన్నారు. మంగళవారం గంగారం గ్రామంలో మంతెన శ్రీనివాస్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా చిట్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. పుష్కర పనులలో ఉన్నత అధికారుల సూచన మేరకు విధులు నిర్వహిస్తూ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు చనిపోతే పంచాయతీరాజ్ అధికారులు, ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. శ్రీనివాస్ కుటుంబానికి 25 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకోకపోతే ధర్మ సమాజ్ పార్టీ పక్షాన ఆందోళన చేస్తామని సందర్భంగా హెచ్చరించారు.
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం..
సరస్వతి పుష్కరాలలో విధులు నిర్వహిస్తూ మరణించిన మంతెన శ్రీనివాస్ కుటుంబానికి గంగారం కార్యదర్శి బీరెల్లి కరుణాకర్ రూ.10,000 తాజా మాజీ సర్పంచ్ తెప్పెల దేవేందర్ రెడ్డి రూ. 5000 ఆర్థిక సహాయం అందించారు. పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కారోబార్ లు కోడెల దాము పటేల్, మెండ మల్లేష్ గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.