20-05-2025 08:14:13 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): దివ్యాంగుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వివాహం చేసుకున్న జంటలో ఒకరు దివ్యాంగులుంటేనే గత ప్రభుత్వం రూ.లక్ష వివాహ ప్రోత్సాహ పథకం అందించింది. కానీ తాజా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం పరిమితిని విస్తరించేందుకు మంగళవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిం అనితా రామచంద్రన్ జీవో జారీ చేశారు.
ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే వర్తించని పథకం, ఇప్పటి వరకూ ఒకరు దివ్యాంగుడు లేదా దివ్యాంగురాలు కాగా, మరొకరు సాధారణ వ్యక్తి అయినప్పుడు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం అందేది. ఇకపై ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నా ప్రోత్సాహం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రోత్సాహ పథకం అమలు వల్ల మరిన్ని దివ్యాంగుల పెళ్లిళ్లకు మార్గం సుగమం కానుంది.