calender_icon.png 21 May, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి

20-05-2025 08:25:45 PM

సిఐటియు టౌన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన.. 

భద్రాచలం (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక, ప్రజా, వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు ఆల్ ఇండియా కమిటీ పిలుపుమేరకు భద్రాచలంలో సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం జరిగింది. సిఐటియు పట్టణ కన్వీనర్ బండారు శరత్ బాబు, సిఐటియు నాయకులు గడ్డం స్వామిలు మాట్లాడుతూ... కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం కార్మికుల ఉద్యోగుల పొట్ట కొట్టే నిర్ణయాలు చేస్తోందని, ఇప్పుడున్న ఎనిమిది గంటల పని విధానం స్థానంలో 12 గంటల పని విధానం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు ఉద్యోగులు పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.

ఉద్యోగుల కార్మికులను ఇబ్బంది పెడుతూ కార్పొరేట్ సంస్థలకు మోడీ ప్రభుత్వం దాసోహం చేస్తోందని విమర్శించారు. వీటికి వ్యతిరేకంగా జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. సిఐటియు ఎలక్ట్రికల్ నాయకులు కొలగాని రమేష్ మాట్లాడుతూ... కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ బిల్లును విద్యుత్ ఉద్యోగులందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు పి సంతోష్ కుమార్, ఎస్ అజయ్ కుమార్, టీ ముత్తయ్య, అప్పారి రాము, డి రామకృష్ణ, చంద్ర లీల, వెంకటలక్ష్మి, జి రామరాజు, మురళీకృష్ణ, బండి ప్రసాద్, రవి, సీతారాములు, కొనసా రవి ఇంకా సిఐటియు అనుబంధ సంఘాల రంగాల నాయకులు పాల్గొన్నారు.