28-12-2025 12:42:04 AM
తాగి మృతి చెందిన తనయుడు
మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీలో ఘటన
మిర్యాలగూడ, డిసెంబర్ 27 (విజయక్రాంతి): ఆస్పత్రి నిర్వాహకుల నిర్లక్ష్యం ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మంచి నీటి క్యాన్ పక్కనే కెమికల్ ద్రావ ణం ఉన్న క్యాన్ ఉంచగా రెం డు ఒకేలా భావించిన ఆ తల్లి...జ్వరంతో ఉన్న కొడుక్కి టాబ్లెట్ వేసి తాపించింది. దీంతో కొడుకు కండ్ల ముందే మృతి చెందిన సంఘటన శనివారం మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో జరిగింది.
కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు అనుముల మండల కేంద్రానికి చెం దిన సండ్రాల సత్యనారాయణ, రామలింగమ్మలకు కుమారు డు, కుమార్తె ఉన్నారు. కుమారుడు సండ్రాల గణేశ్(19) హైదరాబాద్‌లోని ఓ ప్రైవైట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సెలవుల సందర్భం గా ఇంటికి వచ్చిన గణేశ్‌కి జ్వరం రావడంతో మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు శనివారం తీసుకొచ్చారు. డాక్టర్ వచ్చేలోపు సిబ్బంది ఒక డోలో టాబ్లెట్ వేసుకోమని సూచించారు.
దీంతో గణేశ్ తల్లి మంచి నీళ్లకోసం కూలర్ ఫ్రిజ్ వద్దకు వెళ్లగా అందులో నీళ్లు లేకపోవడంతో పక్కనే బాత్రూం లు కడిగేందుకు వాడే కెమికల్ ద్రవంతో నిండిన తెల్లటి క్యాన్ ఉంది. అందులోవి కూడా మంచి నీళ్లు అని భావించిన ఆమె వాటిని తెచ్చి టాబ్లెట్ వేసుకునేందుకు కొడుక్కు ఇచ్చింది. తాగిన కొద్ది సేపటికే గణేశ్ వాంతులు చేసుకొని పడిపోయాడు. గమనించిన ఆస్పత్రి సిబ్బంది పక్కనే ఉన్న మరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు.
హాస్పిటల్ ఎదుట బంధువుల ఆందోళన
గణేవ్ మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాస్పిటల్ వద్దకు చేరు కొని న్యాయం చేయాలని ఆందోళన చేశారు. హాస్పిటల్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే తన కొడుకు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపించారు. ఘటన స్తలికి వచ్చిన పోలీసులు బందోబస్తు కల్పించగా న్యాయం చేస్తామన్న వైద్యుల హామీతో ఆందోళన విరమించారు.