25-07-2025 02:12:04 AM
కోల్ మైన్స్ కార్మిక సంఫ్‌ు
ఖైరతాబాద్, జూలై 24 (విజయక్రాంతి): సింగరేణి పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఫ్‌ు రాష్ర్ట అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి సారంగపాణి రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారంం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరు ల సమావేశంలో వారు మాట్లాడుతూ..
కోల్ ఇండియా, సింగరేణి, నైవేలి బొగ్గు కంపెనీలను కాపాడాలని, రెగ్యులర్ ఉద్యోగుల ద్వారా కనీసం 50 శాతం బొగ్గు ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని అన్నారు. సింగరేణి కాంటాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్య లు తీర్చాలని లేదంటే జూలై 23 నుంచి సెప్టెంబర్ 17 వరకు ప్రజాందోళన నిర్వహిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.