calender_icon.png 26 December, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ టూర్‌లో మానకొండూరు జడ్పీ విద్యార్థులు

26-12-2025 02:38:55 AM

భోజన, వసతి, రవాణా సౌకర్యం కల్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

మానకొండూరు, డిసెంబరు 25 (విజయ క్రాంతి): నాలుగు రోజుల ఢిల్లీమథురఆగ్రా పర్యటనలో భాగంగా కరీంనగర్ జిల్లా మానకొండూరులోని పీఎంశ్రీ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 60 మంది విద్యార్థులు గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. వీరందరికీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన అధికారిక నివాసంలో భోజన, వసతి  సౌకర్యం కల్పించారు. ప్రత్యేకంగా రవాణ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.

తొలిరోజు విద్యార్థులంతా ఢిల్లీలోని ఇండియా గేట్, నేషనల్ పోలీస్ మెమోరియల్, ఎర్రకోట, రాజ్ ఘాట్, బిర్లా మందిర్, అక్షర్ ధామ్ ఆలయం, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, సెంట్రల్ సెక్రటేరియట్లను సందర్శించా రు. శుక్రవారం భారత పార్లమెంట్, ప్రధానమంత్రుల సంగ్రహాలయంను సందర్శించనున్నారు. అనంతరం హుమాయున్ సమాధి, సఫ్దర్జంగ్ సమాధి, పురానా చ్‌రానా, కుతుబ్ మినార్ వంటి ప్రముఖ చారిత్రక కట్టడాలను వీక్షించి భారతదేశ చరిత్ర, శిల్పకళపై అవగాహన పెంచుకోనున్నా రు. శనివారం మథుర లోని శ్రీ కృష్ణ జన్మస్థలాన్ని సందర్శించి అనంతరం ఆగ్రాలో పర్యటిస్తారు.

అదే రోజు సాయంత్రం దక్షిణ్ ఎక్స్ప్రెస్ ద్వారా జమ్మికుంటకు తిరుగు ప్రయాణం అవుతారు. ఈ పర్యటన ద్వారా విద్యార్థులకు జాతీయ స్థాయి సంస్థలు, చారిత్రక కట్టడాలు, భారతదేశ సాంస్కృతిక వారసత్వంపై విలువైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మానకొండూరు స్కూల్ అధ్యాపకులు ఈ టూర్ ను ఏర్పాటు చేశారు.