26-12-2025 02:40:27 AM
ట్రాన్స్ జెండర్స్‌పై ప్రత్యేకదృష్టి
కరింనగర్, డిసెంబర్25(విజయక్రాంతి):ట్రాన్స్ జెండర్స్ లో మార్పు తీసుకురావడం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. రాష్ట్రంలో మొదటి సారి2023 లో తొలి ఉపాధి యూనిట్ ను కరింనగర్ లో అందించగా తాజాగా ఉపాధి, పునరావాస ప థకం ను ప్రకటించింది.కరీంనగర్ జిల్లాలోని ట్రాన్స్ జెండర్లకు ఆర్థిక పునరవాస పథకం క్రింద Rs.75,000/ చొప్పున మొత్తం 3 యూనిట్లకు 2,25,000/- రూపాయలు 100% స బ్సిడి కి కేటాయించారు.
అర్హులైన ట్రాన్స్ జెండర్ల నుండి దరఖాస్తులు ఈ నెల 31 లోగా స్వకరించాలని జిల్లా సంక్షేమ అధి కారి, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయో వృ ద్ధుల శాఖ, నిర్ణయించింది . రాష్ట్రంలో తొలిసారిగా అది కరింనగర్ లో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కింద స్వ యం ఉపాధి యూనిట్ ఏర్పాటుకు ఒక ట్రాన్స్జెండర్‌కి రుణం మంజూరు చేయగా ఒక ట్రాన్స్జెండర్ కి నాలుగు చక్రాల డ్రై వింగ్ లైసెన్స్ ఇవ్వడం ద్వారా తొలిసారిగా రికార్డు సృష్టించా రు.
షెడ్యూల్ కులాల సభ్యురాలు ఆషాడం ఆశకు రూ.5 లక్షల సబ్సిడీ రుణం మంజూరు చెశారు., దానితో ఆమె ఫోటో స్టూ డియోను అడునికరించుకో గలిగారు. 2023 లో కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో అప్పటి కలెక్టర్ ఆర్వి కర్ణన్ ఆశలకు రూ.5 లక్షల చెక్కును అందజేశారు.
అశే ఆదర్శం
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శాస్త్రీనగర్కు చెందిన ఆశా కరీంనగర్ లో స్థిరపడింది. ఫోటోగ్రఫీపై మక్కువ ఉన్న ఆమె ఫోటోగ్రఫీ రంగాన్ని ఎంచుకుని 2017 నుండి ఆదర్శనగర్లో ఫోటో స్టూడియోను నిర్వహిస్తోంది. ఫోటోగ్రఫీ ద్వారా జీవనోపాధి పొందే తన సామర్థ్యాలపై నమ్మకంతో ఈ రంగాన్ని ఎం చుకున్నానని ఆశా విజయక్రాంతి కి తెలిపింది.
ఆమె పుట్టినరోజు వేడుకలు, వివాహానికి ముందు మరియు వివాహా నంతర షూట్లలో పాల్గొనడమే కాకుండా ఇతర కార్యక్రమాలను కూడా కవర్ చేస్తోంది. ఆర్థిక సమస్య ఉండటంతో ఆమె పి ఎం ఈ జి పీ కింద రుణం తీసుకోవాలని ఎంచుకొని 20 23 లో అప్పటి.కలెక్టర్ చేతులమీదుగా రుణం పొంది స్టూడియోను అప్గ్రేడ్ చేసుకుంది.