calender_icon.png 9 January, 2026 | 3:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీ రామ్ జీ పథకంపై ప్రతిపక్షాల దుష్ప్రచారం ప్రజలు నమ్మవద్దు

06-01-2026 12:33:20 AM

ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ల, జనవరి 5 (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీ రామ్ జీ పథకానికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో, ఈ పథకంపై ప్రతిపక్ష పార్టీలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని భాజపా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేదలు, కార్మిక వర్గాలకు పనిఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జీ రామ్ జీ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. అయితే ఈ పథకం అమలును జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.

జీ రామ్ జీ పథకానికి చట్టబద్ధత కల్పించడంతో ఇకపై ఎలాంటి ప్రభుత్వం వచ్చినా దీనిని రద్దు చేసే అవకాశం లేదని, ఇది పేదలకు శాశ్వత హక్కుగా మారిందని విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మకుండా వాస్తవాలను గుర్తించాలని ఆయన కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అందుకే ప్రతి పథకాన్ని పారదర్శకంగా, ప్రజల మేలు కోసమే అమలు చేస్తోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె.ఎస్. రత్నం, బీజేపీ చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అతెల్లి అనంతరెడ్డి, పార్టీ నాయకులు ఆంజనేయులు గౌడ్, కుంచo శ్రీనివాస్, వెంకటరెడ్డి, మాణిక్య రెడ్డి, శర్వలింగం, వెంకట్ రామ్ రెడ్డి, కృష్ణ గౌడ్, అశోక్ పత్తి సత్యనారాయణ, జయశంకర్ గౌడ్, గాజులగూడెం శ్రీనివాస్ రెడ్డి కె.శ్రీనివాస్ కరుణాకర్ రెడ్డి గణేష్ చందు శ్రీకాంత్ రెడ్డి పాగా వెంకటేష్,  రవీందర్ త్రినేత్ర రామకృష్ణ కార్యకర్తలు పాల్గొన్నారు.