24-01-2026 12:00:00 AM
సమస్యకు పరిష్కారం ఏమిటి? ప్రశ్నిస్తున్న ప్రజలు
ఖానాపూర్ సంపూర్ణ బంద్
ఖానాపూర్, జనవరి ౨౩ (విజయక్రాంతి): చిలికి గాలి వానలా రూపు దాల్చుకుంటుంది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠ శాల సాధన కమిటీ ఆందోళన. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం ఖానాపూర్ నియోజకవర్గానికి కేటాయింపు జరగ గా... ఆ పాఠశాల నిర్మాణం చేయాలంటే ఖానాపూర్ లో 25 ఎకరాల స్థలం లేదని కాబట్టి ఉట్నూర్ పట్టణంలో నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే నిర్ణయం కాగా అది తమ మండలానికి నిర్మల్ జిల్లాకు కేటాయించారని ఆ పాఠశాల నిర్మాణం ఖానాపూర్ లోనే జరిగితే ఇక్కడి నాలుగు మండలాల ప్రాంత విద్యార్థులకు మేలు జరుగుతుందని డిమాం డ్ చేస్తూ ఖానాపూర్ ,కడం, పెంబి ,దస్తురాబాద్ ,మండలాల్లో అన్ని ప్రతిపక్ష పార్టీలు జేఏసీగా మారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
గత మూడు నెలలుగా వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలు చేపట్టి శుక్రవారం పట్టణంతో పాటు నాలుగు మండలాల్లో బంద్ చేపట్టారు. కాగా ఖానాపూర్ మున్సిపాలిటీలో బందు ప్రశాంతంగా జరిగింది. దేమైనా నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పాఠశాల నిర్మాణం విషయమై తీవ్ర చర్చ సాగుతుందన్నది వాస్తవం. వెరసి ముందు న్న మున్సిపల్ ఎన్నికలపై ఈ వివాదం ప్రభావం ఎలా ఉంటుందన్నది ఎవరికి లాబిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.