calender_icon.png 18 July, 2025 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతి లేని భవనాల కూల్చివేత

26-05-2025 10:12:15 PM

బిల్డర్లు, ప్రజలు నిబంధనలు పాటించాలి - టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సంతోష్ సింగ్

మణికొండ: మణికొండ మున్సిపల్ పరిధిలోని పంచవటి కాలనీ అల్కాపురి గో గ్రీన్ కాలనీలలో అనుమతులు ఉల్లంఘించి నిర్మించిన అంతస్తుల స్లాబులను టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. సోమవారం జీ + 4 అనుమతి పొంది జీ + 5, +6 అంతస్తులు నిర్మించిన భవనాలను టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. మణికొండ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్(Manikonda Municipal Commissioner Pradeep Kumar) ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సంతోష్ సింగ్(Town Planning Officer Santosh Singh) ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు చేపట్టారు.

ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సంతోష్ సింగ్ మాట్లాడుతూ... ప్రజలు, బిల్డర్లు అందరూ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ నిబంధనల మేరకు భవనాలు నిర్మించుకోవాలి. అనుమతి ఒకటి తీసుకుని నిర్మాణం మరోలా ఉంటే చట్టపరిధిలో తప్పకుండా చర్యలు తీసుకుంటాం, కూల్చివేతలు చేపడతాం. ఎంతటివారైనా చట్టాన్ని గౌరవించాలని, ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు. ఇక నుండి మణికొండలో భవన నిర్మాణాల విషయంలో ప్రతి రోజూ స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతున్నాం. ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరిగినా, తన దృష్టికి వస్తే అదే రోజు పనులు ఆపివేయిస్తాం. నిర్మాణం చేపట్టిన తర్వాత కూల్చడం వల్ల బిల్డర్స్ నష్టపోతారు, కడుతున్న సమయంలోనే ఆపివేస్తే ఆ నష్టాన్ని నివారించుకోవచ్చు. అన్నారు.