07-10-2025 11:39:10 PM
-ఎన్నికల నిర్వహణపై సర్వత్ర ఉత్కంఠ
-ఆశావాదులు పెరిగిన టెన్షన్
-అభ్యర్థుల ఎంపికలో వడపోత చేస్తున్న పార్టీలు
నిర్మల్, అక్టోబర్7(విజయక్రాంతి): స్థాని క సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర హైకో ర్టు బుధవారం తీర్పు వెలువడి నుంచి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై జిల్లాలో సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. రాష్ట్ర ప్రభు త్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి అందుకు సంబంధించిన జీవోలను జారీ చేస్తూ ఎన్నికల నోటిఫికేషన్ కూడా అధికారికంగా ప్రకటించింది. ఈనెల తొమ్మిది నుంచి ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ 13 నుంచి సర్పంచుల నామినేషన్ల ప్రక్రియ చేపట్టబోతున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసింది.
ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం నిర్మల్ జిల్లాలో 18 జెడ్పిటిసి 157 ఎంపీటీసీ స్థానాలతో పాటు 3,366 వార్డ్ మెంబర్ స్థానాలను రిజర్వేషన్లను ప్రకటించింది. ఎన్నికల నిర్వహణకు కావలసిన సామాగ్రి ఎన్నికల సిబ్బంది పోలీ సు బందోబస్తు ఎన్నికల నియామవళి తదితర అంశాలను పూర్తి చేశారు. కోర్టు తీర్పు ఆధారంగా ఎన్నికల ప్రక్రియ ఆధారపడి ఉం డడంతో ఎన్నికలు ఉంటాయా లేదా వాయి దా పడతాయని ఆసక్తి జిల్లాలో రాజకీయ పార్టీల నేతలు తర్జనబర్జ్జున పడుతున్నారు. 18 జెడ్పిటిసి స్థానాలతో పాటు 157 ఎంపీ స్థానాలు 400 గ్రామపంచాయతీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది.
నేటి తీర్పుపై తీవ్ర ఉత్కంఠ
జిల్లా యంత్రాంగం స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ని ప్రకటించి ఎన్నికల నిర్వహ ణపై దృష్టి పెట్టిన నేపథ్యంలో 42 శాతం బీసీల రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందన్న అంశంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. నిర్మల్ జిల్లాలో 18 మండలాలు 400 గ్రామపంచాయతీలు 3,336 వార్డు లు ఉండగా ఇప్పటికీ జిల్లా యంత్రాంగం అన్ని స్థానాల్లో రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించిన నేపథ్యంలో జిల్లాలో 18 స్థానాలు బీసీ జనరల్‌కు నాలుగు బీసీ మహిళలకు 4 ఎస్సీ జనరల్‌కు రెండు ఎస్టీ జనరల్‌కు రెండు జనరల్ మహిళలకు 2 జనరల్‌కు నాలుగు సీట్లు కేటాయించగా 157 ఎంపీ స్థానాల్లో 66 బీసీలకు రిజరవ్డ్ చేశారు.
గ్రామపంచాయతీలో 470లకు గాను 150 మందికి బీసీలకు అవకాశం దక్కింది. 2011 జనాభా లెక్కలను అనుసరిం చి ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల పక్కనే రొటేషన్ పద్ధతిలో అమలు చేయగా బీసీలకు రిజర్వేషన్ల పక్కలపై కొందరు హైకోర్టు ఆశించడం తో హైకోర్టు తీర్పు బుధవారం వెల్లడించనుంది. 42 శాతం బీసీ రిజర్వేషన్‌పై చట్టబద్ధ త లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఎన్నికల నిర్వహణపై హైకోర్టు డైరెక్షన్ ఎలా ఉంటుందని ఆసక్తి జిల్లా నేతల్లో టెన్ష న్కు గురిచేస్తుంది. ప్రభుత్వం మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నా లు చేస్తూనే ఎన్నికల నిర్వహణకు అన్ని జిల్లాల అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించింది. ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ల ప్రక్రియకు హైకోర్టు బ్రేక్ వేస్తే పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని మోకి కంగా ఆదేశాలు ఇచ్చినట్టు జిల్లా అధికారులు తెలిపారు.
అభ్యర్థులపై పార్టీల్లో వడపోత
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రాజకీ య చైతన్య ఉన్న నిర్మల్ జిల్లాలో స్థానిక సం స్థల ఎన్నికలు మూడు పార్టీలకు ప్రతిష్టాత్మక కానున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ బిజెపి పార్టీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పిటిసి ఎంపిటిసి సర్పస్థానంలో తమ మద్దతు ధరలను గెలిపించుకునేందుకు బలమైన అభ్యర్థుల కోసం వడపోత కార్యక్ర మా న్ని నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ఖానాపూర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రాతినిథ్యం వహిస్తుండగా నిర్మల్ ముధోల్‌లో ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి రామారావు పటేల్ ప్రాతినిత్య వహిస్తున్నా రు.
బీఆర్‌ఎస్ నుంచి సీనియర్ నేతలు ఖానాపూర్ నుంచి జాన్సన్ నాయక్ నిర్మల్ నుంచి రామకృష్ణారెడ్డి ముదురు నుంచి కిరణ్ కారే లోలం శ్యాంసుందర్ వంటి సీనియర్ నేతలు జెడ్పిటిసి ఎంపిటిసి సర్పంచ్ అభ్యర్థులపై వడపోత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్నందున ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల ను దక్కించుకొని బిజెపి ఎమ్మెల్యేలకు చెక్కు పెట్టేందుకు కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఐక్యతతో ముందుకు పోతున్నారు.
మాజీ మంత్రులు రెడ్డి వేణుగోపాల చారి డిసిసి అధ్యక్షులు శ్రీ ఆర్ రావు మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్ విట్టల్ రెడ్డి సీనియర్ నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ లో తమ తమ మద్దతు దారులను ఎన్నికల బరిలో దించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లా పరిషత్ పీఠం బీసీ జనరల్ కేటాయించడంతో మూడు పార్టీలు జడ్పీ చైర్మన్ అభ్యర్థి పై ఇప్పటికి కసరత్తును కూడా పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని మండలాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు గెలుపొందేలా కార్యచరణ రూపొందించుకొని దాన్ని అమలు చేస్తున్నారు.
ఆర్థికంగా ప్రజాబలం ఉన్న నేతలకే..?
సర్పంచులకు పార్టీ గుర్తు సంబం ధం లేకపోవడంతో అభ్యర్థుల ఎంపి కపై కొన్ని పార్టీలు ఆచితూచి అడిగేస్తున్నాయి. ప్రజాబలం ఉన్న ఏ నాయకు డైన పోటీ చేయవచ్చని ఇప్పటికే ముఖ్య నేతలు గ్రామీణ నేతలను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జిల్లాలో మెజార్టీ స్థానాలు బీసీలకు దక్కడం మహిళా రిజర్వేషన్లు ఎక్కువ గా ఉండటం అభ్యర్థుల అన్వేషణపై అన్ని పార్టీల్లో తర్జనభజన పడుతున్నా రు. ఆర్థికంగా ప్రజాబలమున్న నేతలకు టికెట్లు ఇచ్చే విధంగా ముఖ్య నేతలందరూ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తు న్నారు. అయితే ఎన్నికల నిర్వహణపై కోర్టు ఇచ్చే తీర్పుక ఆధారంగా ఎన్నికల నిర్వహణ భవిష్యత్తు ఉండడంతో రాజకీయ నాయకులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.