24-05-2025 12:33:23 AM
టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు వీరయ్య
హుజూర్ నగర్, మే 23: తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని, తెలంగాణను సాకారం చేసిన ఘనత జర్నలిస్టులకు దక్కిందని టీయూడబ్ల్యుజే సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వజ్జే వీరయ్య అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలో ఈ నెల 31 న హైదరాబాద్ లో జరిగే టీజేఎఫ్ రజతోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. జర్నలిస్టులు తమ వృత్తి ని సైతం లెక్కచేయకుండా పోరాడి తెలంగాణ సాకారం చేశారన్నారు.
రాష్ట్ర అధ్యక్షులు, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటాలలో ముందుంటామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు పి శ్యామ్ సుందర్ రెడ్డి,నేషనల్ కౌన్సిల్ సభ్యులు సురేష్ గౌడ్,హుజూర్ నగర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు త్రిపురం రమేష్ రెడ్డి, దుగ్గి ఉషశ్రీ,కీత సుధాకర్, దొంతగాని రాజా రమేష్, ధూళిపాళ శ్రీనివాస రావు, ఎస్‌ఎమ్ రఫీ, జెట్టి తేజస్, వట్టికూటి మహేష్,ఒగ్గు విశాఖ, బొడ్డు గోవిందరావు, తేళ్ల రవి తదితరులు పాల్గొన్నారు.