24-05-2025 12:33:58 AM
- బీజేపీ నాయకుడు, మాజీ మేయర్ వై సునీల్ రావు
కరీంనగర్, మే 23 (విజయ క్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో హను మాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన హిందూ ఏక్తా యాత్ర విజయ వంతమ యిందని బీజేపీ నాయకుడు, మాజీ మేయర్ వై సునీల్ రావు అన్నారు.
శుక్రవారం ఆయన విలేక రుల సమావేశంలో మాట్లాడుతూ కరీంనగర్లో హిందువుల బలమేంటనేది స్పష్టంగా క నిపించిందన్నారు. హిందూ ఏక్తా యాత్రకు వర్షాన్ని లెక్కచేయకుండా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారని అన్నారు. భారతదేశ సైనికులు ఎలాగైతే దేశాన్ని కాపా డుతారో, అలాగే పెద్ద ఎత్తున హిందువులు వచ్చి ఏక్తా యాత్రను విజయవంతం చేశారని అన్నారు. కరీంనగర్ అంటే నే కాషాయం అనే విధంగా నగర వీధులన్నీ కాషాయ జెండాలు -రెపరెపలాడుతూ ఆనందం కలిగించాయన్నారు.
హిందూ ఏక్తా యాత్ర విజయవంతానికి కృషి చేసినవారంద రికి ధన్యవాదాలు తెలిపారు. ర్యాలీని చూసిన తర్వాత కొంత మంది నిద్రలేని రాత్రిని గడి పారని, కరీంనగర్లో కాషాయ దళాన్ని చూసిన తర్వాత కొంతమంది జీర్ణించుకోలేకోతున్నార ని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంభాషణ హిం దూ సమాజంలో కొత్త ఉత్సాహాన్ని నింపిం దన్నారు. భారత్, పాక్ యుద్ధాన్ని ఖర్గే, రాహుల్, రేవంత్ లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న మనస్తత్వంతో అలోచించడం చాలా దుర్మా ర్గమన్నారు.
ఇలాంటి దిగజారుడు తనాన్ని కాంగ్రెస్ పార్టీ మానుకోవాలన్నారు. గతంలో పొత్తులు పెట్టుకున్న చరిత్ర బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలదని అన్నారు. కల్వకుంట్ల కవిత లెట ర్ రాస్తే కరీంనగర్లో ఒక మంత్రి బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసిందని వ్యాఖ్యలు చేశారని, మంత్రికి ఏమైనా అవగాహన ఉందా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ తో బీజేపీకి ఎప్పటికీ పొత్తు కుదరదని అన్నారు. లోపాయికార ఒప్పందం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి బీఆర్‌ఎస్ పార్టీ ఎ న్నికల్లో మద్దతు పలికిన చరిత్ర మీదన్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీ పార్టీవైపు చూస్తున్నారనే కవిత చెప్పిన మాట సజీవ సాక్ష్యమని సునీల్ రావు అన్నారు.