calender_icon.png 24 October, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాసీల్దార్ల రూటే సప‘రేటు’!

24-10-2025 12:00:00 AM

 - ఒక్కో ఫైలు ఒక్కో ధర ప్రైవేట్ వ్యక్తులతో వసూళ్లపర్వం

- కాసులు కురిపిస్తున్న రెవెన్యూ సదస్సు దరఖాస్తులు

- క్యాష్ చేసుకుంటున్న రియల్టర్లు, దళారులు

- పరిష్కారం చూపని భూభారతి 

నాగర్ కర్నూల్, అక్టోబర్ 23 (విజయక్రాంతి); సుదీర్ఘ కాలంగా భూ సమస్యలతో రైతుల మధ్య చిచ్చుపెట్టి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిప్పుతూ రెవెన్యూ అధికారులపై దాడులకు సైతం పాల్పడే విధంగా రైతులను ఏ మార్చిన ధరణి పో ర్టల్ని సమూలంగా తొలగిస్తూ రైతు భూ స మస్యల నుండి విముక్తి పొందడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది.

భూ సర్వేలు, మిస్సింగ్ సర్వే నెంబర్లు, రికార్డు సవరణలు, వారసత్వ హ క్కులు, పాస్బుక్ జారీ, భూ వివాదాల పరిష్కారం వంటి అంశాలను పరిష్కరించడం కోసం ప్రభుత్వం ఆయా మండల తాసిల్దార్ ల చేత గ్రామాల్లో రైతు సదస్సులను ఏ ర్పాటు చేసి వినతులను స్వీకరించింది. కానీ రైతుల నుండి స్వీకరించిన వినతులను పరిష్కరించాల్సిన సంబంధిత మండల తాసి ల్దార్లు తమ నిజ స్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఒక్కో సమస్యకు ఒక్కో రేటు నిర్ణయించి రైతుల నుండి అడ్డగోలుగా ముడుపులు అం దుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఏసీబీ దాడుల నుండి తప్పించుకోవడం కోసం ఒక్కో అధికారి ఒక్కో కార్యాలయంలో ఆయా పార్టీ లీడర్లు, ప్రైవేటు వ్యక్తులను బి నామీలుగా ఏర్పాటు చేసుకొని వారిచేత వ సూళ్ల పర్వానికి పాల్పడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.

పని భారం సమయభావం పేరుతో ఒక్కో అధికారి ప్రైవేటు వ్యక్తులను  తాసిల్దార్ కార్యాలయంలోకి అనుమతిస్తూ వారిచేత కుల, ఆదాయ, ధ్రువపత్రాలతో పా టు భూ రిజిస్టర్ ఇతర అన్ని వాటిల్లోనూ డబ్బులు వసూలు చేస్తూ కొత్త దందాకు తెర లేపుతున్నారని విమర్శలు ఉన్నాయి. ప్రస్తు తం గ్రామాల్లో సర్పంచులు లేక ప్రత్యేక పాల న నడుస్తున్న ఈ తరుణంలో గ్రామాల్లో ఆయా పార్టీల ప్రధాన లీడర్లు వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఆయా కార్యాల యంలో పైరవీకారులుగా అవతారమెత్తి సా మాన్యుల నుండి అందిన కాడికి దండుకుంటున్నారని చర్చ జరుగుతోంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వంటి వాటి పేరుతో  లబ్ధిదారుల నుండి ముడుపులు అందుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

పరిష్కారానికి నోచుకోని రెవెన్యూ దస్త్రాలు..!

జిల్లాలోని కల్వకుర్తి, నాగర్ కర్నూల్, కొల్లాపూర్ వంటి నియోజకవర్గాల్లో జాతీ య రహదారి నిర్మాణ పనులు జరుగుతుండగా వాటి పరిసరాల్లోని రైతుల భూములు, భూ సేకరణ, వివాదాల్లో అత్యధికంగా అధికారులు ముడుపులు అందుకుంటున్నట్లు వి మర్శలు వెల్లువెత్తుతున్నాయి. అచ్చంపేట, కొల్లాపూర్ వంటి అటవీ, దేవాదాయ భూ ముల సరిహద్దు గ్రామాల్లోనూ రెవెన్యూ అ ధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

ప్రధాన రహ దారులకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ కబ్జాదారులకు కొమ్ముకాస్తూ వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను పట్టించుకోవడం లేదని ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి. ఆయా మండల తా సిల్దార్లకు వచ్చే దరఖాస్తులను బట్టి ఒక్కో దరఖాస్తు ఒక్కో ధర నిర్ణయిస్తూ ప్రైవేటు వ్యక్తుల చేత రైతుల నుండి ముక్కు పిండి వసూలు చేస్తున్నారని డబ్బులు ఇచ్చే వారికి ఫైల్ కదిలిస్తూ ఇవ్వని రైతులకు రోజుల తరబడి కార్యాలయానికి తిప్పుతున్నారని వాపోతున్నారు.  జిల్లా వ్యాప్తంగా 17,750 రెవెన్యూ దరఖాస్తులు రాగ అందులో కేవలం 6464 దర ఖాస్తులను మాత్రమే పరిష్కరించారు. ఇంకా 11,314 దరఖాస్తులను పెండింగ్లోనే ఉంచారు. 

గడప దాటరు భూ సమస్యలు పరిష్కరించరు..

 రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతుల భూ సమస్యలను పరిష్కరించ డం కోసం భూభారతి చట్టాన్ని తీసుకురాగా రెవెన్యూ అధికారులు మాత్రం క్షేత్రస్థాయి పర్యటన చేయకుండా కార్యాలయాలకే పరిమితమై రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇతర ఆయా పార్టీ ముఖ్య లీడర్లతో మంతనాలు చేస్తూ డబ్బు సంపాదనే లక్ష్యంగా దస్త్రాలను కదిలిస్తున్నారని విమర్శలు ఉన్నాయి.

 చాలాకాలంగా గత ప్రభుత్వంలోనూ తీవ్ర నిరాశ తో ఉన్న రైతులకు రెవెన్యూ సదస్సు ద్వారా పరిష్కారం దొరుకుతుందని ఆశగా ఉన్న రైతులకు మాత్రం మొండిచేయి దక్కుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 1 నుండి 30 తేదీ లోపు పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటిని పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం డెడ్లైన్ విధించింది ఇప్పటికైనా మండల స్థాయి రెవె న్యూ అధికారులు రైతు సమస్యలను పరిష్కరిస్తారా వేచి చూడాలి.