calender_icon.png 25 November, 2025 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన నాయకులు

25-11-2025 06:50:59 PM

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూస శంకర్ యాదవ్

బెజ్జూర్ (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని అంగన్వాడి కేంద్రాలలో ఇందిరా మహిళా శక్తి చీరలను ఐకెపి ఎపిఎం మోహన్ దాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూస శంకర్ మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఇందిరా శక్తి చీరలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మహిళల గౌరవాన్ని కాపాడేందుకు ఇందిరాగాంధీ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని అన్నారు.

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపడుచుకు చీరలను అందించడం జరుగుతుందని వారు తెలిపారు. పేదల సంక్షేమం కోరే ప్రభుత్వమని అన్నారు. మహిళలు తమ కాళ్ళ మీద నిలబడి కుటుంబ పోషణతో పాటు వ్యాపారాలు చేసుకుని స్వయం సమృద్ధి దిశగా ప్రయాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆత్రం రాజారాం, కార్యదర్శి గురుదాస్, కేశవ్, శివజీ, దుర్గయ్య మహిళలు పాల్గొన్నారు.