calender_icon.png 18 December, 2025 | 6:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలు చేసింది

13-12-2025 12:00:00 AM

గెలిచిన బీఆర్‌ఎస్ మద్దతు సర్పంచ్ లను అభినందించిన మాజీ ఎమ్మెల్యే

నల్గొండ టౌన్, డిసెంబర్ 12: స్థానిక ఎన్నికల్లో అధికరా పార్టీ అనేక రాచకాలు చేసినప్పటికీ పార్టీ అభ్యర్థులు అన్నిటిని అధిగమించి ప్రజల సహకారంతో విజయం సాధించారని బి ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు నల్గొండ నియోజకవర్గంలో బి.ఆర్.ఎస్ మద్దతు దారులుగా నిలిచిన సర్పంచులను ఆయన తన కార్యాలయంలో శుక్రవారం అభినందిం చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ప్రతిపక్షంలో ఉంటూ తీవ్రమైన ఒత్తిడిలోనూ., పోలీసులు, కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతూ.. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ, అధికారం అడ్డం పెట్టుకొని ఎన్ని అక్రమాలు అరాచకాలకు పాల్పడిన... తమ అభ్యర్థులు ఎదురొడ్డి నిలిచి.. గణనీయమైన విజయాలు అందుకున్నారని,తెలిపారు ఇదే స్ఫూర్తి, జడ్పిటిసి ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో కొనసాగించాలని కోరారు.

ఈ సందర్భంగా.. తమ పార్టీ పక్షాన నిలబడిన సర్పంచులను ఉపసర్పంచ్ లను వార్డు మెంబర్లను.గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.. సర్వారం సర్పంచ్ గా తగుళ్ల శ్రీనయ్యను 834 ఓట్ల భారీ మెజార్టీతో గ గెలిచినందుకు ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, సీనియర్ నాయకులు సింగం రామ్మోహన్, తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు పల్రెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి. మాజీ సర్పంచ్ ఎలుక శ్రీనివాస్ రెడ్డి, ల తోపాటు.. నూతనంగా సర్పంచులుగా ఎన్నికైన, తగుళ్ళ శ్రీను, గుర్రం సాంబయ్య, తీగల యాదయ్య రేకల మౌనిక ఎస్ కే కమల్.. ఉప సర్పంచ్లు గంట అంజయ్య తదితరులు పాల్గొన్నారు