calender_icon.png 19 December, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు అందుబాటులో ఉండి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి

18-12-2025 05:47:29 PM

రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి

సీపీఎం సర్పంచులకు సన్మానం 

నకిరేకల్ (విజయక్రాంతి): ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన సాగిస్తూ గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి అన్నారు. రామన్నపేట మండలంలోని మునిపంపుల, దుబ్బాక గ్రామాల్లో సీపీఎం బలపరిచిన సర్పంచులు బొడ్డుపల్లి వెంకటేశం, గట్టు నర్సింహాను స్థానిక సీపీఎం కార్యాలయంలో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రలోభాలు పెరిగిన పరిస్థితుల్లో, ప్రజలను మభ్యపెట్టకుండా పోరాటాలే పెట్టుబడిగా గెలుపొందడం అభినందనీయమని అన్నారు.

ప్రజల సమస్యలను నిరంతరం అధ్యయనం చేసి పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన పేదలకు అందేలా చూడాలని, అర్హులైన వారికి ఇండ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేసి గ్రామాలను కమ్యూనిస్టు దృక్పథంతో ఆదర్శంగా నిలపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాగిరు కిష్టయ్య, సీపీఎం మండల కార్యదర్శి వర్గ సభ్యుడు బోయని ఆనంద్, మాజీ వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గొరిగే సోములు, మండల కమిటీ సభ్యుడు మేడి గణేష్ తదితరులు పాల్గొన్నారు.