18-12-2025 05:45:21 PM
కాంగ్రెస్ నాయకులు రాయపూడి వెంకట నారాయణ..
కోదాడ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్చడం చాలా సిగ్గుచేటు అని ఉమ్మడి నల్గొండ జిల్లా మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు రాయపూడి వెంకట నారాయణ అన్నారు. గురువారం కోదాడలో ఆయన మాట్లాడుతూ భారతీయుల జ్ఞాపకాల నుంచి మహాత్మా గాంధీని లక్ష్యంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.
పిల్లలకు గాంధీజీ గురించి తెలియకూడదు అని ప్రజలకు ఆయన పేరును స్మరించుకోకూడదని వారి ఉద్దేశమని అన్నారు. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వ నిధులు తోటే ఈ కార్యక్రమం జరిగేది కానీ మారిన విధానం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు 40% కేంద్ర ప్రభుత్వం 60% భరించే విధంగా బిల్లును మార్చడం జరిగింది. దీనివల్ల రాష్ట్రాలపై అదనపు భారం పడుతుందని అన్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చడం వల్ల పేదలకు చాలా అన్యాయం జరుగుతుందని ఈ బిల్లు పేదల వ్యతిరేకి అని అన్నారు.